రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నమయ్య మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, తిరుమల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నమయ్య మార్గం ద్వారా ఆకేపాటి అమరనాధ్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పార్వేట మండపం వద్ద అమరనాధ్ రెడ్డికి మాజీ ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. కడప జిల్లా రాజంపేట నుండి 4 రోజులుగా నాలుగు వేల మంది భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తూ తిరుమలకు చేరుకున్నారు. టిటిడి అధికారులు కాలినడకన తిరుమలకు వచ్చిన భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేసింది. ఎప్పటి నుండో అన్నమయ్య మార్గాన్ని అందుబాటులోకి తీసుకురావలని కోరుతున్నామని ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు.
ఇప్పటికీ 25 సార్లు అన్నమయ్య మార్గంలో కాలినడకన తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. చాలా కష్టతరమైన నడకదారి అయినప్పటికీ వేలాది మంది భక్తులు నడిచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. అన్నమయ్య మార్గంలో పాదయాత్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అని అన్నారు.