2026 horoscope- Rahu Ketu Transit: కొత్త సంవత్సరం రాకతో మనలో చాలామంది తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుకుంటారు. రాబోయే 2026 సంవత్సరం కూడా అందుకు మినహాయింపు కాదు. చాలా మంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం తమ రాశి ఫలితాలను తెలుసుకుంటూ, కొత్త ఏడాది తమ జీవితంలో మార్పులు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే సంవత్సరం రాహు, కేతు గ్రహాల సంచారం మూడు రాశుల వారికి విశేషమైన శుభఫలితాలను అందించబోతుందనే విశ్వాసం జ్యోతిష్యవేత్తల్లో ఉంది.
రాహు, కేతు జ్యోతిష్యంలో..
రాహు, కేతు జ్యోతిష్యంలో నీడ గ్రహాలుగా పరిగణించబడతాయి. ఇవి వ్యక్తి జీవితంలో సానుకూల లేదా ప్రతికూల మార్పులను తెచ్చే శక్తిని కలిగి ఉంటాయని చెప్పడం జరుగుతోంది. ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వగా, నీచస్థానంలో ఉన్నప్పుడు సవాళ్లను తెస్తాయి. కానీ 2026లో ఈ రెండు గ్రహాలు కొత్త స్థానాలకు సంచారం చేయబోతున్నాయి. ఆ సంచారం వల్ల మూడు రాశుల వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నాయి.
Also Read: https://teluguprabha.net/devotional-news/simple-rituals-to-gain-wealth-blessings-of-guru-and-shukra/
రాహు మకర రాశిలోకి..
రాబోయే సంవత్సరం డిసెంబర్ 5న రాహు, కేతు గ్రహాలు తమ ప్రస్తుత స్థానాలను విడిచి కొత్త రాశులలో ప్రవేశించనున్నాయి. రాహు మకర రాశిలోకి అడుగుపెడితే, కేతు కర్కాటక రాశిలో స్థిరపడనుంది. ఈ మార్పు తర్వాత ఇవి దాదాపు 18 నెలల పాటు అదే స్థానంలో ఉండనున్నాయి. ఈ కాలంలో కొన్ని రాశుల వారు ఆర్థికంగా, వృత్తిలో, కుటుంబంలో సానుకూల ఫలితాలను అనుభవిస్తారని చెబుతున్నారు.
తుల రాశి
తుల రాశి వారిపై రాహు, కేతు సంచారం విపరీతంగా అనుకూలంగా ప్రభావం చూపనుంది. రాహు వీరి నాలుగో ఇంట్లో ఉండగా, కేతు పదో ఇంట్లో ఉండనుంది. ఈ స్థానం వీరి జీవితంలో కొత్త అవకాశాలను తెచ్చిపెట్టబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు సాఫీగా పూర్తవుతాయి. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.
ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, లాభదాయకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది.తుల రాశి వారు 2026లో ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే సంవత్సరం కావొచ్చు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టే అవకాశం, ఇంటి శుభకార్యాలు జరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి 2026 సంవత్సరం మార్పుల కాలంగా మారనుంది. రాహు కేతు ప్రభావం వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత సంవత్సరాల్లో ఎదురైన కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభాలు, ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తాయి.
ధనస్సు రాశి వారు ఈ కాలంలో కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. తమ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. విదేశీ అవకాశాలు లేదా ఉన్నత విద్యలో విజయాలు సాధించే అవకాశం కూడా ఉంది. 2026 సంవత్సరం వీరి జీవితంలో నూతన ఉత్సాహం నింపబోతుందని చెప్పవచ్చు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఈ రాహు, కేతు సంచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. రాహు ప్రభావం వల్ల కొత్త వాహనం, స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇక కేతు ప్రభావం వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
ఇంటి వాతావరణంలో ఆనందం, సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లేదా భాగస్వామ్య అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. అంతేకాకుండా మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
Also Read: https://teluguprabha.net/devotional-news/karthika-masam-bath-significance-and-spiritual-benefits/
2026 సంవత్సరం వృషభ రాశి వారికి కొత్త ఆరంభాల సమయం కావొచ్చు. గత కాలంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎదుగుదల సాధిస్తారు.
రాహు కేతు సంచారం ప్రభావం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహు, కేతు సంచారం మన జీవనశైలిపై, ఆలోచనలపై, నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది. ఈ గ్రహాల స్థానం మారినప్పుడు కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను పొందుతారు. మరికొన్ని రాశుల వారికి సవాళ్లు ఎదురవుతాయి. కానీ ఈసారి ముఖ్యంగా తుల, ధనస్సు, వృషభ రాశుల వారికి రాహు, కేతు సంచారం శుభముగా మారబోతోందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ మూడు రాశుల వారు వచ్చే సంవత్సరం కొత్త ఆరంభాలు చేయడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి అనుకూల కాలాన్ని పొందబోతున్నారు.


