Monday, April 14, 2025
HomeదైవంTirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..?

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలంటే..?

తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు కొండపైకి తరలివెళ్తున్నారు. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

- Advertisement -

ఇదిలా ఉంటే సోమవారం స్వామివారిని 66,503 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,941 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.16 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. ఇక టీటీడీ(TTD) ట్రస్టులకు భువనేశ్వర్‌కు చెందిన దాతలు రూ. కోటి విరాళం అందజేశారు. ఇందులో స్విమ్స్‌కు రూ.40 లక్షలు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.30 లక్షలు, అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 20 లక్షలు, సర్వ శ్రేయస్ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళం ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News