ఫిబ్రవరి నెలలో తిరుమల(Tirumala) శ్రీవారి హుండీ ఆదాయం రూ.100.69 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. దీంతో వరుసగా 36వ నెల కూడా రూ.100కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు. అయితే తిరుమలపై కుంభమేళా ఎఫెక్ట్ పడినట్లు చెబుతున్నారు. దీంతో ఫిబ్రవరి నెలలో భక్తుల తాకిడి తగ్గిందన్నారు. ఈ నెలలో ఒక్కరోజు కూడా భక్తులు బయట క్యూ లైనల్లో నిలబడలేదని ప్రకటించారు. ఎక్కువ సమయం కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండానే శ్రీవారి దర్శనం జరిగిందని చెప్పారు. ఇక ఫిబ్రవరి నెలలో శ్రీవారిని 19.12 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు.
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో స్వామి వారిని త్వరగానే దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శనివారం వెంకన్నను 71,785 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.84కోట్లు వచ్చినట్లు వెల్లడించారు