మలయప్పగా కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యం విశ్వవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. శుక్రవారం అభిషేకానికి, దర్శనానికి వచ్చిన భక్తులంతా ఏడు కొండల్లోని భారీ పొగమంచును చూసి ఆశ్చర్యపోయారు.
- Advertisement -
కొండపైన ఎటుచూసినా దట్టమైన పొగమంచు మధ్య చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధంతా సరికొత్తగా కనిపించింది. భక్తులు ఆద్యంతం ఈ వాతావరణాన్ని ఆస్వాదించేలా చక్కని దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
మంచు మేఘాలు తిరుమాడ వీధుల్లో తిరుగుతున్నట్టు తిరుమల కొండను చుట్టేసాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. భక్తులు తమ ఆనందాన్ని ఆపలేకపోయారు.