Tuesday, May 13, 2025
HomeదైవంTirumala: శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర

Tirumala: శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర

అరుదైన కానుక

శ్రీవారికి రాజుల కాలం నుంచి ఎన్నో కానుకలు, మరెన్నో మణులు మాణిక్యాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. ఏటా హుండీలో కానుకలు సైతం రికార్డు స్థాయిలో సమర్పిస్తున్నారు. అరుదైన వస్త్రాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువకుడు శ్రీవారికి సమర్పించారు. స్వామి వారికి సమర్పించే వస్త్రాలు ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు రకాల చీరలు తయారు చేసారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నల్ల విజయ చేనేత కళాకారుడు. చేనేత వస్త్రాలు తయారు చేయడంలో ఆయన నేర్పరి. స్వామి వారికి ప్రత్యేక వస్త్రాన్ని సమర్పించాలని సంకల్పించాడు. 5.5 మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో రెండు చీరలు తయారు చేశారు. గతంలో సైతం స్వామి వారికి అగ్గిపెట్టెలో పట్టే రెండు రకాల చీరలను తయారు చేసి సమర్పించాడు. ఈ పట్టుచీర తయారీకి దాదాపు 25 రోజుల వ్యవధి పట్టింది. అగ్గిపెట్టెలో అమరే పట్టుచీరను శనివారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఈవో శ్యామల రావుకు చూపించారు. రేపు ఉదయం శ్రీవారి దర్శించుకుని హుండీలో చీరను సమర్పించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News