తిరుమలలో వైకుంఠ ద్వాదశి సందర్భంగా వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. తిరుమలలో నిర్వహించే తీర్థ ముక్కోటిలలో అతి ముఖ్యమైనది శ్రీవారి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా. ఈ తీర్థోత్సవాన్ని వైకుంఠ ద్వాదశి నాడు నిర్వహించడం ఆనవాయితీ.
శేషాచలం అడవులలో ఉన్న 66 కోట్ల తీర్థాలన్నింటిలో స్వామివారి పుష్కరిణి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శనివారం తెల్లవారుజామున సుదర్శన చక్రత్తాళ్వార్‌ను స్వామి వారి పుష్కరిణికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తిరుమల చిన్న జీయర్ స్వామి సమక్షంలో స్వామి పుష్కరిణి జలాల్లో అర్చకులు శ్రీ సుదర్శన్ చక్రత్తాల్వార్లకు చక్రస్నానం ఆగమోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె. శ్యామలరావు, బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.