Saturday, October 19, 2024
HomeదైవంTirumala: బిగ్ అలర్ట్.. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల

Tirumala: బిగ్ అలర్ట్.. తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి బిగ్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే అర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. నేటి నుంచి ఎల్లుండి(సోమవారం) ఉదయం 10 గంటల వరకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఉంటుందని వెల్లడించింది. అనంతరం ఎల్లుండి మధ్యాహ్నం లక్కీ డిప్ విధానంలో అర్జిత సేవా టికెట్లు భక్తులకు కేటాయించనున్నారు.

- Advertisement -

ఇదిలా ఉంటే తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 61,576 మంది భక్తులు దర్శించుకోగా.. 23,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లుగా నమోదు అయిందని టీటీడీ అధికారులు తెలిపారు.

మరోవైపు శ్రీవారి మెట్ల మార్గాన్ని తిరిగి తెరిచారు టీటీడీ అధికారులు. దీంతో ఈ నడకదారిలో భక్తులు కొండపైకి చేరుకుంటున్నారు. కాగా ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు శ్రీవారి మెట్ల మార్గం మూసివేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News