Saturday, November 15, 2025
HomeదైవంToday Horoscope: ఇవాళ ఈ రెండు రాశుల వారు గుడ్ న్యూస్ వింటారు.. ఇందులో మీది...

Today Horoscope: ఇవాళ ఈ రెండు రాశుల వారు గుడ్ న్యూస్ వింటారు.. ఇందులో మీది ఉందా?

Today Horoscope, 11th October 2025: మనలో చాలా మంది పంచాంగం చూడకుండా ఏ పని మెుదలుపెట్టరు. ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఇంట్లో శుభకార్యం చేయాలన్నా, బిజినెస్ ప్రారంభించాలన్నా మంచి రోజు ఎప్పుడా అని క్యాలెండర్ చూస్తారు. గ్రహాలు, నక్షత్రాలు, రాశులను కదలికలను బట్టి మన జాతకం ఎలా ఉందో చెబుతారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. నేడు (అక్టోబర్ 11న) రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి
ఈ రాశివారు ఏ పనినైనా పూర్తి శ్రద్ధతో చేస్తారు. ఉద్యోగంలో మీకు శాలరీతోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ప్రశంసలు కూడా లభిస్తాయి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. దుబారాను నివారించండి. గుడ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది.

వృషభ రాశి
వృషభరాశి వారికి ప్రతీది కలిసి వస్తుంది. ఉద్యోగంలో సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు లాభపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నమవుతాయి.

మిథున రాశి
ఈరాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షిస్తారు. మీరు పెద్ద ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉంది. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.

సింహరాశి
మీ పనిలో నైపుణ్యం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీ లీడర్ షిప్ క్వాలిటిస్ తో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రేమలో విజయం సాధిస్తారు. మీకు ఎవరితోనైనా గొడవలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి ఇదే మంచి టైం.

కర్కాటక రాశి
మీ కెరీర్ కు సంబంధించి శుభవార్త వింటారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో ఏ కార్యాన్నైనా సులభంగా సాధిస్తారు. ఈ సమయంలో తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి.

కన్యా రాశి
ఈరోజు మీ పని భారం పెరుగుతుంది. కొత్త వారిని కలుసుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ మానసికంగా చాలా బలంగా ఉంటారు.

వృశ్చిక రాశి
ఈరాశి వారు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఈ సమయంలో ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, అది మీ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆర్థికంగా లాభపడతారు.

ధనస్సు రాశి
ఉత్సాహంతో రోజును ప్రారంభిస్తారు. ఏదైనా పని లేదా వ్యాపారాన్ని మెుదలుపెట్టడానికి ఇదే మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది.

Also Read: Mercury Transit 2025 – వృశ్చిక రాశిలోకి వెళ్లబోతున్న బుధుడు.. దీపావళి తర్వాత ఈ 3 రాశుల వారు కోటీశ్వరులవ్వడం పక్కా..

మకర రాశి
లవ్ సక్సెస్ అవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తారు. పాత వివాదాలు ముగుస్తాయి. మీరు మీ పనిలో వృద్ధి సాధిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి.

తులా రాశి
మీరు గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ మాటలకు విలువ ఉంటుంది. పని చేసే చోట ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవి చేసుకోకండి.

కుంభ రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. మీరు కొత్త కొత్త స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంది.

మీన రాశి
మీలో ఉన్న సృజనాత్మకతను బయటపెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లవ్ లైప్ బాగుంటుంది. కుటుంబంతో మంచి సమయం గడిపే అవకాశం ఉంది. మీతో మీరు కాస్త టైం గడపండి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad