Sunday, February 8, 2026
HomeదైవంHoroscope:మకర సంక్రమణ పుణ్యకాలంలో అదృష్టం కలిసి వచ్చే రాశి ఏదంటే!

Horoscope:మకర సంక్రమణ పుణ్యకాలంలో అదృష్టం కలిసి వచ్చే రాశి ఏదంటే!

Sankranti horoscope:ఈరోజు 2026 జనవరి 15 గురువారం. శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరంలో పుష్యమాసం కొనసాగుతోంది. హేమంత ఋతువు మధ్యలో ఉన్న ఈ రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. మకర సంక్రాంతి సందర్భంగా చాలా మంది భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. అలాగే ఈ పండుగ రోజు తమ రాశి ప్రకారం ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. పండితుల అంచనాల ప్రకారం ఈ రోజు కొన్ని రాశులకు శుభఫలితాలు ఉండగా మరికొన్ని రాశులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, ఆర్థిక వ్యవహారాల్లో రాశి ప్రభావం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మేష రాశి వారికి..

మేష రాశి వారికి ఈ రోజు కలిసివచ్చే అంశాలు మరియు సవాళ్లు రెండూ కనిపిస్తాయి. కొన్ని కీలక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఊహించని వ్యక్తులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఈ రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారంలో ఉన్నవారు లాభనష్టాలను జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఆర్థికంగా అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉండటంతో డబ్బు వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం.

Also Read:https://teluguprabha.net/devotional-news/sankranti-festival-traditions-significance-and-celebrations-in-telugu-states/

ధనస్సు రాశి వారికి..

ధనస్సు రాశి వారికి సంక్రాంతి రోజు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అవసరం లేని ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. కుటుంబ విషయాల్లో చిన్నపాటి విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు పెద్దల సూచనలు పాటిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి ముందడుగు వేయడం ఈ రోజు చాలా అవసరం.

మిథున రాశి వారికి ..

మిథున రాశి వారికి ఈ రోజు ఉత్సాహంగా గడిచే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. విద్యార్థులకు అనుకూల వార్తలు అందే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కూడా లాభం కలిగే అవకాశం ఉంది. మొత్తంగా మిథున రాశి వారికి ఈ రోజు సానుకూలంగా సాగుతుంది.

వృషభ రాశి వారికి..

వృషభ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా కలిసివచ్చే రోజు కావచ్చు. ఆదాయం పెరగడానికి అనుకూల అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేసినా సంతృప్తి ఉంటుంది. పని విషయంలో స్థిరత్వం ఉంటుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఉపయోగపడేలా ఉండే అవకాశం ఉంది. మితంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు అందుతాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకోని నష్టం కలగకుండా జాగ్రత్త పడాలి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మంచిది కాదు. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం అవసరం. విద్యార్థులకు చదువులో సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ప్రయాణాలను వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది.

Also Read: https://teluguprabha.net/devotional-news/can-we-eat-non-veg-on-makar-sankranti-day/

కుంభ రాశి వారికి..

కుంభ రాశి వారికి ఈ రోజు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి పై అధికారుల నుంచి ప్రశంసలు అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సంక్రాంతి వేడుకలను ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు కుంభ రాశి వారికి సంతోషాన్ని ఇచ్చే రోజు కావచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News