Kalashtami October 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెల కృష్ణ పక్షంలోని ఎనిమిదో రోజున అంటే కృష్ణ పక్ష అష్టమి నాడు కాలాష్టమి వస్తుంది. ఈరోజున కాలభైరవుడిని పూజిస్తారు. శివుడు యెుక్క ఉగ్రరూపానికి ప్రతీకే కాలభైరవుడు. అందుకే కాలాష్టమి నాడు వీరిద్దరిని పూజిస్తారు. ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ నెలలో వచ్చే కాలాష్టమికి చాలా ప్రత్యేకం. ఈరోజున కాలభైరవుడిని పూజించడం వల్ల ఆయన అనుగ్రహంతోపాటు రక్షణ కూడా భక్తులకు లభిస్తుంది. ఈ దేవుడిని ఆరాధించడం వల్ల నెగిటివిటీ మీ దరి చేరదు. అందుకే అక్టోబరులో కాలాష్టమి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత తెలుసుకుందాం.
కాలాష్టమి తేదీ, శుభ ముహూర్తం
ఈ సంవత్సరం అష్టమి తిథి 2025 అక్టోబర్ 13న మధ్యాహ్నం 12:24 గంటలకు ప్రారంభమై 2025 అక్టోబర్ 14న ఉదయం 11:10 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, కాలాష్టమి సోమవారం(అక్టోబర్ 13) నాడు జరుపుకోనున్నారు.
కాలభైరవుడి కథ
సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒకప్పుడు గొప్ప యాగం నిర్వహించాడు. దానికి కూతురు భర్త అయిన మహాదేవుడును ఆహ్వానించలేదు. పిలవకపోయినప్పటికీ సతీదేవి ఆ యాగానికి వెళ్లింది. అక్కడ పరమశివుడు లేకపోయిన అతడికి అవమానం జరగడంతో తట్టుకోలేకపోయిన సతీదేవి యోగాగ్నిలో భస్మం చేసుకుంది. ఆ విషయం తెలిసి కోపంతో రగిలిపోయిన మహాదేవుడు తన జడల నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయడంతోపాటు అతడిని సంహరించమని చెప్పాడు. దీంతో అక్కడకు వెళ్లిన వీరభద్రుడు దక్ష ప్రజాపతి తల నరికాడు. ఆ తర్వాత జన్మలో సతీదేవి యెుక్క ఉగ్రరూపమైన కాళీకా దేవిని.. శివుడు బైరవ రూపాన్ని ధరించి కాళీకా దేవిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి కలయిక వల్ల అష్ట భైరవులు పుట్టారు.
Also Read: Dhanteras 2025 – ధంతేరాస్ లేదా ధనత్రయోదశి ఎప్పుడు? బంగారం ఏం టైంలో కొనుగోలు చేయాలి?
కాలాష్టమి పూజా విధానం
ఈ పండుగ నాడు భక్తులు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఇంటి పూజాగదిని క్లీన్ చేయాలి. ఆ తర్వాత కాలభైరవుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలి. ఈరోజున కాల భైరవుని కథను వినడం మరియు శివుడిని ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. కాల భైరవుని వాహనంగా చాలా మంది నల్లకుక్క అని భావిస్తారు. అందుకే ఈరోజున దానికి పాలు, పెరుగు, స్వీట్స్ వంటి ఆహారంగా పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుంది. బ్రాహ్మణులకు అన్నదానం లేదా వస్త్రదానం లేదా డబ్బుదానం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజున పితృదేవతలను ఆరాధించడం వల్ల వారి ఆత్మకు చేకూరుతుంది. కాలాష్టమి పర్వదినాన కాలభైరవుడిని భక్తితో ఆరాధిస్తే మీరు శత్రువులపై విజయం సాధించడం పక్కా.


