Krishna Janmashtami 2025: నేడే(ఆగస్టు 16) కృష్ణాష్టమి. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని జన్మాష్టమిగా జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు కృష్ణాష్టమి చేసుకుంటారు. ఈ పండుగనే జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు. గుజరాత్ లో ఈ వేడుకను శ్రీజగదాష్టమి అని అంటారు. పురాణాల ప్రకారం, శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారమని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జరపబోయేది శ్రీ కృష్ణుడి 5252వ జన్మదినంగా తెలుస్తోంది.
జన్మాష్టమి శుభ ముహూర్తం
అష్టమి తిథి ప్రారంభం: ఆగస్టు 15, 2025 – రాత్రి 11:49 గంటలకు
అష్టమి తిథి ముగింపు: ఆగస్టు 16, 2025 – రాత్రి 09:34
రోహిణి నక్షత్రం ప్రారంభం: ఆగస్టు 17, 2025 – తెల్లవారుజామున 04:38
రోహిణి నక్షత్రం ముగింపు: ఆగష్టు 18, 2025 – తెల్లవారుజామున 03:17
నిషిత పూజ సమయం: సుమారుగా అర్ధరాత్రి 12:04 AM నుండి 12:47 AM (ఆగస్టు 16-17)
పూజా విధానం
కృష్ణాష్టమి నాడు భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి..రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం బాలకృష్ణుడిని పూజిస్తారు. తొలుత పంచామృతంతో అభిషేకం చేసి ఆ తర్వాత భోగాన్ని నైవేద్యంగా పెడతారు. ఆ దేవుడికి ఎంతో ఇష్టమైన వెన్నతోపాటు అటుకులు, పెరుగు, పళ్లు మెుదలైనవి నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో పాటు పూజలో ‘అచ్యుతం కేశ్వం కృష్ణ దామోదరం రామ్ నారాయణం జంకీ వల్లభం..!!’ అనే మంత్రాన్ని ఉచ్ఛరణ చేస్తారు. కృష్ణుడి పూజలో వేణువు, నెమలి ఫించం ఉండటం తప్పనిసరి.
Also Read: Krishna Janmashtami 2025 Wishes – కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..
అంతేకాకుండా ఊయల కట్టి అందులో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు అలపిస్తారు. పుర వీధుల్లో ఉట్ల పండుగను జరుపుతారు. ఎత్తుగా కట్టిన ఉట్టిని కొట్టేందుకు చిన్నా పెద్దా అందరూ పోటీ పడి మరి కొడతారు. శ్రీకృష్ణ జయంతి సందర్భంగా గోదానం చేయడం, భగవద్గీతను పారాయణం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున మధుర, బృందావనంతోపాటు ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలను కన్నుల పండువగా జరుపుతారు. ఈరోజున తల్లిదండ్రులు చిన్న పిల్లలను బాలకృష్ణుడిలా అలంకరించి..వారి చుట్టూ గోపికలను నిలబెట్టి సందడి సందడి చేస్తారు.


