Saturday, November 15, 2025
HomeదైవంLalita Panchami 2025: లలితా పంచమి నేడే.. అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తం ఇదే..

Lalita Panchami 2025: లలితా పంచమి నేడే.. అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తం ఇదే..

Lalitha Panchami 2025 Date and Significance: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో లలితా పంచమి ఒకటి. ఈరోజున లలితా దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ అమ్మవారు ఆనందం, జ్ఞానం మరియు సంపదను ఇస్తుందని భక్తులు నమ్మకం. ప్రతి ఏటా లలితా పంచమి వేడుకను అశ్వినీ మాసంలో జరుపుకుంటారు. ఈ సంవత్సరం లలితా పంచమి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం తదితర విషయాలు తెలుసుకుందాం.

- Advertisement -

లలితా పంచమి ఎప్పుడు?
లలితా పంచమి సెప్టెంబరు 26, శుక్రవారం ఉదయం 09:33 గంటలకు మెుదలై.. తర్వాత రోజు మధ్యాహ్నం 12:03 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, లలితా పంచమిని సెప్టెంబరు 26న జరుపుకుంటారు. లలితా పంచమి నాడు ఆ తల్లి ఆశీస్సులు పొందాలంటే లలితా పంచమి వ్రతాన్ని ఆచరించాలి. ఈ ఉపవాసం పాటించే వారికి బలం మరియు శక్తిని ఇస్తుంది ఆ దేవత. ముఖ్యంగా ఈ వ్రతాన్ని మహిళలు ఆచరిస్తారు. ఈ రోజున లలితాదేవితో పాటు స్కంద మాతను కూడా పూజిస్తారు. ఆధ్యాత్మిక వృద్ధికి ఈ రోజు చాలా శుభప్రదమైనది. లలితా సహస్రనామం పఠించడం వల్ల మీ కెరీర్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీ జీవితంలో శ్రేయస్సు ఉంటుంది.

Also Read: Mercury Transit 2025 -దసరా తర్వాత బుధుడు సంచారం.. ఈ 3 రాశులను వరించనున్న ఐశ్వర్యం..

లలితా పంచమి ప్రాముఖ్యత
లలితా దేవిని దుర్గాదేవి అవతారంగా భావిస్తారు. కామకుడి బూడిద నుండి ఉద్భవించిన రాక్షస జీవి భండను జయించడానికి లలితాదేవి అవతరించింది. ఈమెనే సౌత్ ఇండియాలో చండీ దేవతగా పూజిస్తారు. లలితా దేవి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు అన్ని సమస్యల నుండి బయటపడటమే కాకుండా మీ జీవితంలో అదృష్టంతోపాటు ఐశ్వర్యం కూడా వస్తుంది. ఈ పండుగ నవరాత్రుల సమయంలో వస్తుంది. లలితా పంచమి గురించి కాళికా పురాణంలో వివరించారు. భక్తులు ఉపవాసం ఉండి లలితాదేవిని పూజించడం వల్ల ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. గుజరాత్ మరియు మహారాష్ట్రలలో లలితా పంచమి రోజు సెలవు ఇస్తారు.

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad