Mahabhagya Yogam Benefits: ఆస్ట్రాలజీ ప్రకారం, కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈరోజు చంద్రుడు కూడా అదే రాశిలోకి వెళ్లబోతున్నాడు. కన్యా రాశిలో వీరిద్దరి సంయోగం ఆగస్టు 27 రాత్రి ఏడు గంటల వరకు ఉంటుంది. కుజుడు-చంద్రుడు కలయిక వల్ల మహాభాగ్య యోగం లేదా చంద్ర మంగళ యోగం రూపొందుతోంది. వేద జ్యోతిష్యశాస్త్రంలో ఈయోగాన్ని చాలా శక్తివంతమైనదిగా భావిస్తారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడనుంది. ఇది ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
కుజుడు-చంద్రల కలయిక ధనస్సు రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కెరీర్ లో అనుకోని పురోగతి లభిస్తుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితానికి సంతానం కలగడం ద్వారా పరిపూర్ణత చేరుకుంది. లక్ కూడా కలిసి వచ్చి మీరు ప్రతి పనిని సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేస్తారు.
మేష రాశి
మహాభాగ్య యోగం మేషరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీకు అన్నింటా విజయం లభిస్తుంది. కెరీర్ లో ఆకస్మిక పురోగతి ఉంటుంది. మీ లవ్ లైఫ్ బాగుంటుంది. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. త్వరలో మీ సుడి తిరగబోతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి.
వృషభరాశి
చంద్ర మంగళ యోగం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. ప్రమోషన్ తోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీ జీవితంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకున్న సమయానికి పనులన్నీ కంప్లీట్ అవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య భాందవ్యం మరింత పెరుగుతుంది. అఖండ ఐశ్వర్యం మీకు సిద్దిస్తుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సమస్యలన్నీ తీరిపోతాయి.
Also Read: Radhashtami 2025 – రాధాదేవి శ్రీకృష్ణుడి ప్రేయసా లేదా భార్య? పురాణాలు ఏం చెబుతున్నాయి?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం సాధారణ నమ్మకాల ఆధారంగా రూపొందించడమైనది. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. ఇలాంటివి పాటించేముందు నిపుణుల సలహా తీసుకోండి.


