Mercury Retrograde Effect: గ్రహాల యువరాజు బుధుడు ఎప్పటికప్పుడు తన రాశిచక్రాన్ని మారుస్తుంది. ప్రస్తుతం ధనస్సు రాశిలో సంచరిస్తున్న బుధుడు నేడు తిరోగమన స్థితిలోకి వెళ్లబోతున్నాడు. ఇదే స్థితిలో నవంబర్ 29 వరకు ఉండనున్నాడు. బుధుడు యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొందరి జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. బుధుడి రివర్స్ కదలిక ఏయే రాశులవారికి అనుకూలంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
కన్య రాశి
బుధుడు సంచారం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. మీ ధైర్యంతోపాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. పనిలో సీనియర్ల సపోర్టు లభిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. మీరు అప్పుల బారిన పడే అవకాశం ఉంది. వృత్తి మరియు ఉద్యోగాలు బాగుంటాయి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధుడు సంచారం గొప్పగా ఉండబోతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు మళ్లీ మీ దరికే చేరుతుంది. జాబ్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. కెరీర్ లో అనుకోని ఎదుగుదల ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది.
మకర రాశి
బుధుడి తిరోగమనం మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు లాభపడతారు. అదృష్టంతోపాటు ఐశ్వర్యం మిమ్మల్ని వరిస్తుంది. ప్రతి పనిలో విజయం మిమ్మల్నే వరిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ బాస్ ప్రశంసలు మీకు లభిస్తాయి. సంసార జీవితం బాగుంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు మీ చెంతకు చేరుతుంది.
Also Read: Mars Asta 2025 -అస్తమించిన కుజుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
మిథున రాశి
మిథునరాశి వారికి బుధుడు రివర్స్ కదలిక అద్భుతంగా ఉండబోతుంది. డబ్బుకు లోటు ఉండదు. కెరీర్ లో ఊహించని పురోగతి ఉంటుంది. బిజినెస్ చేసేవారు ఎన్నో లాభాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీడియా రంగంలో ఉన్నవారు కలిసి వస్తుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. లక్ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది.


