Saturday, November 15, 2025
HomeదైవంAstrology: కన్యా రాశిలో భద్ర యోగం.. ఈ 4 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

Astrology: కన్యా రాశిలో భద్ర యోగం.. ఈ 4 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

Mercury Transit 2025 in Virgo: గ్రహాల యువరాజైన బుధుడు నేడు కన్యా రాశి ప్రవేశం చేయనున్నాడు. బుధుడి యెుక్క ఈ సంచారం కారణంగా పంచ మహాపురుష రాజయోగాల్లో ఒకటైన భద్రపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీనిని చాలా శక్తివంతమైనది మరియు శుభప్రదమైనదిగా భావిస్తారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ భద్ర యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

ధనస్సు రాశి
భద్ర రాజయోగం ధనస్సు రాశివారికి ఎంతో మేలు చేయనుంది. కెరీర్ లో ఎవ్వరూ ఊహించని స్థాయికి ఎదుగుతారు. ప్రమోషన్ వెతుక్కుంటూ వస్తుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు అమాంతం పెరుగుతాయి. నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. సంపద వృద్ధి చెందుతుంది.

మకర రాశి
బుధుడు చేస్తున్న రాజయోగం మకరరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. మీకు నచ్చిన చోటుకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. పని చేసే చోట మంచి గుర్తింపు ఉంటుంది. మీరు చేపట్టిన ప్రతి ప్రాజెక్టును సక్సెస్ పుల్ చేసి చూపిస్తారు.

మిథునరాశి
భద్ర రాజయోగం వల్ల మిథునరాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా దానికి ఫ్యామిలీ సపోర్టు ఉంటుంది. ఆదాయం ఓ రేంజ్ లో పెరుగుతుంది. వ్యక్తిగత మరియు వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కెరీర్ లో సానుకూల మార్పులు ఉంటాయి. ప్రమోషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారం వృద్ధి చెందుతుంది.

Also Read: Mars Transit 2025 – రాబోయే నెల రోజులపాటు ఈ 4 రాశులకు కష్టాలే కష్టాలు..

కన్యా రాశి
ఇదే రాశిలో బుధుడు భద్ర రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దీంతో కన్యారాశి వారి బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోనుంది. మీ వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. కెరీర్ లో ఊహించని గ్రోత్ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మీ సంసార జీవితం అద్బుతంగా ఉంటుంది.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని ఇవ్వడమైనది. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad