Saturday, November 15, 2025
HomeదైవంSankashtahara Chaturthi:  ఈరోజే సంకష్టహర చతుర్థి..సాయంత్ర సమయం ప్రధానం..పూజా విధానం ఇదే!

Sankashtahara Chaturthi:  ఈరోజే సంకష్టహర చతుర్థి..సాయంత్ర సమయం ప్రధానం..పూజా విధానం ఇదే!

Sankashtahara Chaturthi Pooja: ఈరోజు శనివారం సంకష్టహర చతుర్థిని జరుపుతారు. సంకష్ట హర చవితి వ్రతం అంటే? జీవితంలో ఎదురయ్యే సంకటాలను అంటే భరించలేని కష్టాలను శాశ్వతంగా పోగొట్టేది. ఈరోజు వినాయకుడిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని మన నమ్మకం. ముఖ్యంగా ప్రస్తుత కార్తీకమాసంలో వస్తున్న సంకష్టహర చతుర్థి మరిన్ని గొప్ప ఫలితాలును ఇస్తుందని పండితులు చెబుతున్నారు.  హిందూ క్యాలెండర్ ప్రకారం..చతుర్థి తిథి నవంబర్ 8 న ఉదయం 07:32 గంటలకు ప్రారంభమై నవంబర్ 9న తెల్లవారుజామున 4.25 గంటలతో ముగుస్తుంది.ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగడమే కాదు, సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్మిక.

పూజ చేయడానికి శుభ సమయం
బ్రహ్మ ముహూర్తం: ఉదయం 04:53 నుండి ఉదయం 05:46 వరకు
శుభ సమయం: ఉదయం 05:20 నుండి ఉదయం 06:38 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:26 వరకు
విజయ ముహూర్తం: మధ్యాహ్నం 01:53 నుండి 02:37 వరకు
గోధులీ ముహూర్తం: సాయంత్రం 05:31 నుండి 05:57
సంధ్య సమయం: సాయంత్రం 05:31 నుండి 06:50 వరకు
అమృత కాలం: మధ్యాహ్నం 02:09 నుండి 03:35 వరకు
నిషిత ముహూర్తం: రాత్రి 11:39 నుండి నవంబర్ 09 12:31 వరకు
చంద్రోదయం సమయం: 07:59 PM
వ్రతం చేసేవారు పాటించాల్సిన నియమాలు
ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఈరోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ఏ వ్రతం ఆచరించినా కానీ ఉపవాసం మొదటి నియమం. ఆరోగ్య పరిస్థితిని బట్టి పాలు, పండ్లు, పచ్చ కూరలు మాత్రం తీసుకోవచ్చు. మౌనవ్రతం పాటించడం మంచిది.
సంకష్ట హర చతుర్థి వ్రతం చేసే విధానం
వినాయకుడి జలభిషేకం చేయాలి. వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి, ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. సమయంలో సంకష్టహర చతుర్థి కథను చదవాలి, గణేశ మంత్రాలను  పఠించాలి. చంద్రోదయ సమయంలో గణపతికి, చంద్రుడికి, చతుర్థి దేవతకు  హారతి ఇచ్చిన తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని, ఉపవాసాన్ని విరమించాలి.
ముడుపు ఎలా?
వీలైతే ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో పసుపు, కుంకుమ వేసి కొన్ని బియ్యం, వక్కలు, ఎండు ఖర్జూరాలు  దక్షిణ వేసి ఆ వస్త్రాన్ని ముడివేసి గణపయ్య దగ్గర పెట్టాలి. వినాయకుడికి 21వ  సార్లు ప్రదక్షణ చేసి మీ మనసులో  కోరిక చెప్పి నమస్కరించాలి. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని  చేసేవారు అన్ని సమస్యల నుంచి  గట్టెక్కుతారు. అంతేకాదు ఈ వ్రతం చేసిన వారిని ఆ వినాయకుడు స్వయంగా కాపాడుకుంటాడని నమ్మకం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad