చాలా మంది భక్తులు అయ్యప్ప స్వామి(Ayyappa Swami) పుట్టినరోజు ఎప్పుడు అని అడుగుతున్నారు. కేరళ పంచాంగం ప్రకారం శబరిమలలో ప్రతి సంవత్సరం తిధి ప్రకారం ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజు పంబ ఆరట్టు ఉత్సవంగా స్వామివారికి ట్రావెన్కోర్ దేవస్థానం వారు స్వామివారి జన్మదినం జరుపుతారు.
- Advertisement -
ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 11న శుక్రవారం నాడు శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానం నుండి స్వామివారు ఏనుగు పై పంబ నదికి వచ్చి స్నానం చేసి, శబరిమల చేరతారు. ఇది శబరిమలలో జరుపే ప్రత్యేక ఉత్సవం.
అయితే, మన తెలుగు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి జయంతి ఏప్రిల్ 11, 2025 న ఉంది. ప్రతి నెల ఉత్తర నక్షత్రం రోజున స్వామివారిని పూజిస్తే, ఆయన ఆశీస్సులు మనపై ఉంటాయని విశ్వాసం.