Trigrahi Yoga in Scorpio: ఆధ్యాత్మికంగా, గ్రహాల సంచారపరంగా నవంబర్ నెల చాలా ప్రత్యేకమైనది. పైగా ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. ఈ పవిత్రమైన మాసంలో గ్రహాలు తమ స్థానాలను మార్చి ఇతర గ్రహాలతో కలిసి అరుదైన యోగాలను సృష్టించబోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి త్రిగ్రాహి యోగం. ఇటీవల కుజ గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించింది. త్వరలో గ్రహాల రాజైన సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా ఇదే రాశిలోకి వెళ్లబోతున్నారు. వృశ్చిక రాశిలో ఈ మూడు గ్రహాల సంయోగం వల్ల అరుదైన త్రిగ్రాహ యోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి అదృష్టంతోపాటు ఊహించని బెనిఫిట్స్ ను అందించబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఇదే రాశిలో సూర్యుడు, శుక్రుడు మరియు కుజుడు కలవబోతున్నారు. త్రిగ్రాహి యోగం వల్ల వృశ్చిక రాశి వారి అదృష్టం మారబోతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాలను పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
మీన రాశి
మీనరాశి వారికి త్రిగ్రాహ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. మీ చింతలన్నీ తీరిపోతాయి. పేదరికం నుండి బయటపడతారు. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. సంసార జీవితంలో సంతోషం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు భారీగా లాభపడతారు. కెరీర్లో మంచి స్థాయికి చేరుకుంటారు. ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీకు పెళ్లి గడియలు రాబోతున్నాయి.
Also Read: Astrology Remedies – గుడిలో ఈ ఒక్కటి దానం చేశారంటే డబ్బే..డబ్బు
మకర రాశి
త్రిగ్రాహ యోగం మకరరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వీరి సంపద అమాంతం పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. పిల్లలకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. పని లేని వారికి ఉపాధి దొరుకుతుంది.


