Thursday, September 19, 2024
HomeదైవంTTD@US & Canada: అమెరికా, కెనడాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు

TTD@US & Canada: అమెరికా, కెనడాల్లో శ్రీవారి కల్యాణోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో కెనడా, USA లలో జూన్, జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు జరుపనున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈమేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి.

- Advertisement -

కెనడా, USA దేశాలలో స్థిరపడిన తెలుగు, భారతీయుల కోసం జూన్ 4వ తేదీ నుండి జూలై 23 వ తేదీవరకు పద్నాలుగు (14) నగరాలల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణములు నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు. కెనడా, USA దేశాలలో “శ్రీనివాస కళ్యాణోత్సవం” పోస్టర్లను టీటీడీ అధ్యక్షులు వై.వి. సుబ్బారెడ్డి, APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి, టూరిజం అధ్యక్షులు వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు – స్త్రీ, శిశు సంక్షేమ అభివృద్ధి, కాపు కార్పొరేషన్ అధ్యక్షులు అడపా శేషు, ఇతర కార్పొరేషన్ల డైరెక్టర్లు టిటిడి చైర్మన్ తాడేపల్లి కార్యాలయంలో (11.05.2023) ఆవిష్కరించారు. అనంతరం వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాష్ట్ర, దేశ, విదేశాల్లో శ్రీనివాస కళ్యాణములు నిర్వహించాలని నిర్ణయించాము. ఇందులో భాగంగా జూన్, జూలై, అక్టోబర్, నవంబర్ 2022 నెలల్లో USA, UK & Europe లలోని 20 నగరాల్లో అత్యంత వైభవంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణాలు ఆయా దేశాలలోని తెలుగు అసోసియేషన్ల, ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించామన్నారు. గత నెల 28వ తేదీన బహ్రెయిన్ లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి దాదాపు 15 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారన్నారు.

కెనడా, USA లలోని పలు తెలుగు అసోసియేషన్లు, ధార్మిక,సేవా సంస్థల కోరిక మేరకు ఆయా దేశాలలోని భక్తులకోసం టీటీడీ శ్రీవారి కళ్యాణాలు నిర్వహించాలని నిర్ణయించిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ APNRTS ఆయా నగరాల్లోని కార్యనిర్వాహకులతో సమన్వయము చేస్తోందన్నారు.

టీటీడీ నియమాల ప్రకారం శ్రీవారి కళ్యాణం నిర్వహిస్తామన్నారు. తిరుమల శ్రీవారి దేవస్థానం నుండి వెళ్ళే అర్చకులు, వేద పండితులు వైఖానస ఆగమం ప్రకారం శ్రీవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. ఉదయం సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలవుతుంది. తిరుమలలో లాగానే శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహిస్తామన్నారు. ఆయా నగరాల్లో తెలుగు, భారతీయ అసోసియేషన్లు లడ్డూ ప్రసాదాలతో పాటు, భక్తులకు అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారన్నారు. ఉచితంగా శ్రీవారి కళ్యాణోత్సవం తిలకించడానికి అందరూ ఆహ్వానితులే. భక్తులందరూ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించి, ఆ దేవదేవుడి ఆశీర్వాదాలు పొందాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ సిద్ధంగా ఉందని ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వెల్లడించారు.

APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి మాట్లాడుతూ… కెనడా, USA దేశాలలో దేవదేవుడైన శ్రీవారి కళ్యాణాలు నిర్వహించడానికి ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ, అక్కడ ఏర్పాట్లను, వారికి కావలసిన సామాగ్రి విషయంలో ఇటు అర్చకులు, వేదపండితులతో సమన్వయం చేస్తున్నామన్నారు.

కెనడా, USA దేశాలలో “శ్రీనివాస కళ్యాణం” జరిగే నగరాలు, తేదీలు:

Toronto, ON, Canada – 4th June, 2023

Montreal, Quebec, Canada – 10th June, 2023

Ottawa, ON, Canada – 11th June, 2023

Raleigh, NC, USA – 17th June, 2023

Jacksonville, FL, USA – 18th June. 2023

Detroit, MI, USA – 24th June, 2023

Chicago, IL, USA- 25th June, 2023

Atlanta, GA, USA – 1st July, 2023

Dallas, TX, USA – 2nd July, 2023

St. Louis, MO, USA – 6th July, 2023

Philadelphia, PA, USA – 9th July, 2023

Morganville, NJ, USA – 15th July, 2023

Houston, TX, USA – 16th July, 2023

Irving, TX, USA – 21st – 23rd July, 2023 (Srivari Kalyanam & Brahmotsavams)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News