Saturday, November 15, 2025
HomeదైవంKartika Dwadashi: క్షీరాబ్ధి ద్వాదశి..ఈ రాశులవారికి అదిరిపోతుందంతే

Kartika Dwadashi: క్షీరాబ్ధి ద్వాదశి..ఈ రాశులవారికి అదిరిపోతుందంతే

Tulasi Marriage 2025: ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో శుద్ధ ద్వాదశి రోజు తులసి, శాలిగ్రామ్ వివాహం జరుపుకోవడం ఒక పవిత్ర సంప్రదాయం. ఈ సంవత్సరం ఆ శుభదినం నవంబర్ 2న వచ్చింది. ఆ రోజు భక్తులు తులసిని పూలతో అలంకరించి శాలిగ్రాముడితో వివాహం జరుపుతారు. దీన్ని క్షీరాబ్ధి ద్వాదశిగా కూడా పిలుస్తారు. ఈ వేడుకను చూడటానికి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. పండితుల ప్రకారం ఈ రోజున తులసి వివాహం చేయడం వలన కుటుంబంలో సౌఖ్యం, ఆనందం, ఆధ్యాత్మిక శాంతి కలుగుతాయి.

- Advertisement -

తులసి వివాహం..

ఈ సంవత్సరం తులసి వివాహం విశేషంగా నిలవనుంది. ఎందుకంటే ఈ రోజున రెండు ముఖ్యమైన గ్రహాల సంచారం జరగబోతోంది. శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశిస్తుండగా, చంద్రుడు మీన రాశిలోకి సంచరిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర-చంద్రుల ఈ సంయోగం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ యోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా కన్యా, తులా, మీన రాశుల వారికి ఈ సమయం ప్రత్యేక ఫలితాలను అందించనుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/significance-of-kaisika-dwadashi-and-tulasi-kalyanam-in-kartika-month/

కన్యా రాశి

తులసి వివాహం జరిగిన తర్వాత కన్యా రాశివారికి శుభఫలితాలు ప్రారంభమవుతాయి. కొంతకాలంగా ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. కార్యాలయంలో మీ ప్రతిభ గుర్తిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. కొత్త పనులు చేపట్టేందుకు ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. గతంలో ఉన్న విభేదాలు సద్దుమణుగుతాయి.

విద్య లేదా ఉద్యోగ అవకాశాల కోసం విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీడియా, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి గుర్తింపు, పురోగతి లభిస్తుంది. మొత్తం మీద కన్యా రాశివారికి ఇది కొత్త ఆరంభాలకు మార్గం సుగమం చేసే సమయమని చెప్పవచ్చు.

తులా రాశి

తులా రాశిలో శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారికి జీవితం మరింత సానుకూల దిశగా సాగుతుంది. వివాహం ఆలస్యం అవుతున్నవారికి ఈ సమయంలో శుభవార్త రావచ్చు. ఇప్పటికే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆర్థిక పరంగా కూడా మంచి ఫలితాలు సాధిస్తారు.

భవిష్యత్తు పెట్టుబడులకు ఇది సరైన సమయం అవుతుంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలకు విజయం దక్కుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి, సానుకూల ఆలోచనలు మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి.

మీన రాశి

మీన రాశిలో చంద్రుడు సంచరించడం వల్ల ఈ రాశివారికి కొత్త ఉత్సాహం వస్తుంది. శని ప్రభావం కొంత తగ్గి జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో విస్తరణ సాధ్యమవుతుంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభం ఇప్పుడు సాధ్యమవుతుంది. స్నేహితులు, సహచరులతో బంధాలు మరింత బలపడతాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి.

Also Read:  https://teluguprabha.net/devotional-news/karthika-masam-significance-and-river-bath-benefits-explained/

తులసి వివాహం సందర్భంగా ఈ మూడు రాశుల వారికి శుభయోగాలు కన్పిస్తుండగా, మిగతా రాశులవారు కూడా దీన్ని భక్తితో పాటిస్తే ఆధ్యాత్మిక శాంతి, సానుకూల శక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ రోజు దేవీ తులసిని పూజించడం ద్వారా పాపాలు తొలగి, శ్రేయస్సు చేకూరుతుందని విశ్వాసం ఉంది.

భక్తులు ఈ రోజున తులసి మొక్క వద్ద దీపం వెలిగించి, తులసి-శాలిగ్రామ విగ్రహాల ముందు పూజలు చేస్తారు. కొందరు తులసి వివాహాన్ని సాంప్రదాయంగా ఇంట్లోనే జరుపుకుంటారు. ఈ వేడుకలో పాల్గొనడం వలన దంపతుల మధ్య ప్రేమ బంధం బలపడుతుందని కూడా నమ్మకం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad