Tuesday, January 7, 2025
Homeదైవంతులసి మొక్క ఎండిపోతే అర్థమేంటో తెలుసా.. తులసి దళం ఆరోజు కోస్తే అశుభమా..?

తులసి మొక్క ఎండిపోతే అర్థమేంటో తెలుసా.. తులసి దళం ఆరోజు కోస్తే అశుభమా..?

హిందువులు తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దీనిని ప్రత్యక్ష దైవంతో సమానంగా ఆరాధిస్తారు. దేవతా మూర్తులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో. తులసి మొక్కకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. హిందూ ధర్మం అనుసరించే 99 శాతం ఇళ్లలో తులసి మొక్క దర్శనమిస్తుంది. తులసిని లక్ష్మీ దేవిగా భావించి పూజిస్తారు. ఏ ఇంట తులసి మొక్క ఉంటుందో ఆ ఇంట్లో సంపద, సంతోషం ఉంటాయని చాలా మందికి నమ్మకం. అయితే ఇంట్లో తులసి మొక్క పెంచుకోవాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. భక్తిశ్రద్ధలతో తులిసి నాటితే సరిపోదు.. దానిని సంరక్షించుకోవాలి. ఒకవేళ ఆ మొక్క ఎండిపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా వేదాలు చెప్తున్నాయి. తులసిని నిత్యం పూజిస్తే లక్ష్మీ దేవి, విష్ణువు ఆశీస్సులు ఉంటాయని పండితులు అంటుంటారు. ఇంట్లో తులసి మొక్కను నాటినట్లయితే, కొన్ని నియమాలను పాటించడం తప్పనిసరి. తులసికి సంబంధించిన ఈ నియమాలను నిర్లక్ష్యం చేస్తే పేదరికం, దురదృష్టం తప్పదని చెపుతుంటారు. తులసి మొక్కను నాటేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. దానిని ఎప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటాలని చెపుతుంటారు.

ఇక తులిసి మొక్కను నేరుగా భూమిలో కాకుండా కుండీలో నాటాలంట.. అదే విధంగా సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులు తీయడం అస్సలు మంచిదికాదు. అంతేకాదు తులసి మొక్కను ఎప్పుడూ చీకటి ప్రదేశాల్లో ఉంచకూడదు. సాయంత్రం తులిసి మాత వద్ద దీపం వెలిగించాలి. ఇక ఆదివారం నాడు తులసికి నీరు పోయడం మంచిది కాదు. ఈ రోజున తులసి ఆకులను తెంపడం కూడా అశుభం.
తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తులసి దగ్గర ముళ్ల మొక్కలను అస్సలు ఉంచకూడదు. తులసి ఆకులను తీసేటప్పుడు, వేళ్లను మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎప్పుడూ కత్తితో లేదా కత్తెరతో కత్తిరించవద్దు. పూజాది అవసరాలు, ఆరోగ్యరీత్యా వినియోగించే సమయంలో మాత్రమే తులసి ఆకులు పగటి వేళలో తీసుకోవచ్చు. స్నానం చేయకుండా తులసి ఆకులను తాకడం అరిష్టం. స్నానం చేయకుండా తాకినా, ఆకులు తెంపినా అవి పూజలో ఆమోదయోగ్యంగా కావు అని పండితులు చెప్తున్నారు.

ఇక తులసి మొక్క సాధారణంగా శీతాకాలం ఎండిపోకూడదని చెపుతారు.. ఇలా జరిగితే కీడు జరుగుతుందని పండితులు అంటుంటారు. తులసి కోటాలో పచ్చగా ఉండాల్సిన తులసి మొక్క ఉన్నట్టుండి రంగు మారితే అది ఇంటికి అరిష్టం అని ఇంట్లో ఉన్నవారిపై క్షుద్రశ‌క్తుల ప్రభావం ఉన్నట్టు అర్థం అట.. అలానే ఇంట్లో కళకళలాడుతున్న తుల‌సి మొక్క అకస్మాత్తుగా ఎండిపోతే ఇంటి యజమానికి అనారోగ్యం అని కీడు జరిగే అవకాశం ఉందని అర్థమట.. అయితే తులసి చెట్టు పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం, సంతోషం ఉండడమే కాకుండా ఎలాంటి సమస్యలు రావని చెపుతున్నారు. అందుకే తులిసి మాతను పూజించడమే కాకుండా.. దానిని సంరక్షించుకోవడం కూడా చాలా ముఖ్యమని పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News