Tulsi puja benefits: ఏకాదశి రోజు హిందువుల పవిత్ర దినం. ఆ రోజు తులసి పూజ చేస్తే వచ్చే ఫలితాలకు సంబంధించి అంశాలు హిందూ మత గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. తులసి విష్ణువుకు ప్రియమైనదే కాకండా లక్ష్మీదేవి స్వరూపంగా సైతం పరిగణిస్తారు. ఏకాదశి రోజున తులసిని నియమ నిష్టలతో పూజిస్తే.. విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఏకాదశి రోజున తులసి పూజ చేయడం వలన కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం.
తులసిని పూజిస్తే విష్ణుమూర్తికి సంతోషం: తులసి అంటే విష్ణువుకి ప్రియమైనదని అర్థం. హిందు మత గ్రంథాల ప్రకారం ఏకాదశి నాడు తులసిని పూజించడం వల్ల విష్ణువు సంతోషిస్తాడు. ఆయన ఆశీస్సులు కురిపిస్తాడు. ఏకాదశి రోజున తులసి శాలిగ్రామలకు వివాహం జరిపించే సంప్రదాయం సైతం ఉంది. శాలిగ్రామాన్ని విష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఇలా ఏకాదశి రోజున తులసి శాలిగ్రామలకు వివాహం చేయడం వల్ల క్ష్మీదేవి అనుగ్రహం వస్తుంది. కష్టాలన్ని తొలగిపోతాయి.
తులసి పూజ చేయడం వల్ల ఇంట్లో శాంతి: తులసిని చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ప్రతికూలతను తొలగించి సానుకూలతను ప్రసరించే శక్తి తులసికి ఉంటుంది.తులసి లక్ష్మీదేవి నివాసం కాబట్టి.. తులసి మొక్క ముందు దీపం వెలిగించి ఏకాదశి నాడు పూజించడం వల్ల ఇంటి వాతావరణం శుద్ధి అవుతుందని నమ్మకం.తులసి పూజ చేయడం వల్ల ఇంట్లో శాంతి, సామరస్యంతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. దీంతో లక్ష్మీ దేవి స్వయంగా ఆకర్షితులవుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ , గౌరవాన్ని పెంపొందిస్తుంది. ఇది శ్రేయస్సులో ముఖ్యమైన భాగం.
వివాహిత స్త్రీలకు శుభం: ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తులసిని పూజించడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి విముక్తి లభిస్తుంద హిందువుల నమ్మకం. ఏకాదశి నాడు తులసిని సేవించిన లేదా పూజించిన వ్యక్తి మోక్షాన్ని విష్ణుముర్తి ప్రసాదిస్తాడని హిందూ హిందూ మత గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. ఏకాదశి నాడు తులసిని పూజించడం వల్ల వైవాహిక జీవితం మాధుర్యం ఉంటుంది. వివాహిత స్త్రీలకు శుభం కలుగును. వైవాహిక సంబంధంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. దాంపత్య జీవితంలో ఆనందం, సంపద పొందుతారని విశ్వాసం.


