Friday, September 20, 2024
HomeదైవంUgadi Srisailam Utsavalu: కైలాస ద్వారం వద్ద ఏర్పాట్ల పరిశీలన

Ugadi Srisailam Utsavalu: కైలాస ద్వారం వద్ద ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలం మహా క్షేత్రంలో ఉగాది ఉత్సవాలు 19.03.2023 నుండి 23.03.2023 వరకు అయిదు రోజులపాటు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అధికసంఖ్యలో భక్తులు పాదయాత్రతో క్షేత్రాన్నిచేరుకుంటున్నారు.
అందుకే కాలిబాటలో అటవీశాఖ, వైద్యఆరోగ్యశాఖ మొదలైన శాఖల సమన్వయముతో పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా కైలాసద్వారం వద్ద భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేశారు. కైలాసద్వారం వద్ద భక్తులు సేద తీరేందుకు వీలుగా విశాలమైన తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేశారు. కైలాస ద్వారానికి నిరంతరం మంచినీటి సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా కైలాసద్వారం నుండి భీముని కొలను వరకు తాత్కాలిక పైప్ లైన్ ద్వారా మంచినీరు సప్లై చేస్తున్నారు.

- Advertisement -

ఈవో పర్యవేక్షణ
ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారి సంబంధిత ఇంజనీరింగ్ విభాగ అధికారులతో కలిసి కైలాసద్వారం మరియు భీముని కొలను మెట్లమార్గం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారి కైలాసద్వారం వద్ద కన్నడ స్వచ్ఛంద సేవకులు నిర్వహిస్తున్న అన్నదాన శిబిరాన్ని పరిశీలించారు. దాతలు నిర్వహిస్తున్న ఈ అన్నదాన నిర్వహణకు దేవస్థానం పూర్తి సహాయసహకారాలు అందిస్తోంది. ముఖ్యంగా అన్నదాన నిర్వహణకు చలువ పందిర్లు ఏర్పాటు, మంచినీటి సరఫరా, మజ్జిగ సరఫరా మొదలైన ఏర్పాట్లను దేవస్థానం చేస్తోంది. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి నిర్వాహకులతో మాట్లాడుతూ ..తప్పనిసరిగా శుచీ-శుభ్రతలను పాటించాలన్నారు. కైలాసద్వారం వద్ద తగినంత పారిశుద్ధ్య సిబ్బందిని నియమించి, చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని దేవస్థానం పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఈ ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా కార్యనిర్వహణాధికారివారు కాలిబాటతో వచ్చే పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించారు.

కర్నాటక భక్తులు

కాలిబాటలో ఆయా ఏర్పాట్లపై రాయచూర్, విజయపుర, బాగల్ కోట్ మొదలైన ప్రాంతాల నుంచి పాదయాత్రతో వస్తున్న భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు అందరు కూడా ఆయా ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకుంటూ శ్రీస్వామిఅమ్మ వార్లను దర్శించుకోవాలని కూడా భక్తులకు సూచించారు.
ఈ ఏర్పాట్ల పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిదర ప్రసాద్, నీటిసరఫరా విభాగం సహాయ ఇంజనీరు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News