Saturday, February 22, 2025
HomeదైవంPenchalakona: ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

Penchalakona: ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన క్షేత్రం అభివృద్ధి: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం పెంచలకోన (Penchalakona) శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. శుక్రవారం పెంచలకోన క్షేత్రాన్ని వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణతో కలిసి మంత్రి సందర్శించారు. వేద పండితులు, ఆలయ అధికారులు మంత్రి, ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి అమ్మవారు, ఆంజనేయ స్వామిని మంత్రి, ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుభిక్ష, శాంతి, ఐశ్వర్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి, భక్తుల సౌకర్యార్థం మరిన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

- Advertisement -


పెంచకోన అభివృధ్దికి మాస్టర్ ప్లాన్
పెంచలకోన క్షేత్రం అభివృద్ధికి ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించామని, త్వరలోనే ఆమోదింప చేసి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయి ఉన్నాయని, త్వరలోనే టీటీడీ వారితో సంప్రదించి ఈ పనులను కూడా మొదలు పెడతామని చెప్పారు.

అంగరంగ వైభవంగా పెంచలకోన బ్రహ్మోత్సవాలు
మే నెలలో జరగనున్న పెంచలకోన బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి గదులు, దర్శన ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రభుత్వం, దాతలు, భక్తుల సహాయ సహకారాలతో పెంచలకోన క్షేత్రం అభివృద్ధికి పెద్దపేట వేస్తామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.

కూటమి ప్రభుత్వంలో ఆలయాల్లో ఆధ్మాత్మిక శోభ
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుందన్నారు. అన్ని ఆలయాల్లో కూడా ఆగమ శాస్త్రాల మేరకు వేద పండితుల సూచనల మేరకు భగవంతుని కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పురాతన ఆలయాలను ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తూ అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు మంత్రి పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News