Friday, July 5, 2024
HomeదైవంUrukunda: ఈరన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

Urukunda: ఈరన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఉరుకుంద క్షేత్రానికి తరలివస్తున్న భక్తులు

కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద గ్రామంలో వెలసిన వీరన్న స్వామి (నరసింహ స్వామి) క్షేత్రానికి భక్త జనం తరలివస్తున్నారు… శ్రావణమాసం ఉత్సవాలలో స్వామి విశిష్ట వారాలలో మూడవ సోమవారము ప్రత్యేకంగా చెప్పవచ్చు.. ఈ ఒక్కరోజ లక్షకు పైగా భక్తులు స్వామిని దర్శించుకుంటారు.. ఆదివారం నుండి భక్తుల రద్దీ అధికం అయింది.. ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుండే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు ఉరుకుంద క్షేత్రానికి వస్తున్నారు..

- Advertisement -

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు నిరంతర దైవ దర్శనానికి ఏర్పాటు చేశారు… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసిగి సీఐ ఎరిషావలి ఆధ్వర్యంలో కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు… భక్తుల సౌకర్యార్థం ఆదోని, ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలతోపాటు, కర్ణాటకలోని సిరుగుప్ప ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు… రైల్వే ప్రయాణికుల కోసం కుప్ప గల్లు రైల్వే స్టేషన్ నుండి నుండి ఆర్టీసీ అధికారులు రవాణా సౌకర్యాలను కల్పించారు.. మూడవ సోమవారం పురస్కరించుకొని భక్తులకు అన్ని సౌకర్యాలు ట్రస్ట్ బోర్డు చైర్మన్ నాగరాజ్ గౌడ్, ఆలయ ఈవో వాణి తెలిపారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News