Friday, July 5, 2024
HomeదైవంUrukunda Eeranna Swamy: కొలిచేవారికి కొంగుబంగారం ఉరుకుంద ఈరన్న

Urukunda Eeranna Swamy: కొలిచేవారికి కొంగుబంగారం ఉరుకుంద ఈరన్న

ఉరుకుంద ఈరన్నకు అసంఖ్యాకమైన భక్తులున్నారు

నరసింహ స్వామి రూపమైన ఈరన్న స్వామికి ఏడాదిపొడవునా అంగరంగ వైభవంగా సేవలు సాగుతాయి. అందుకే ఇక్కడ సంవత్సరం పొడవునా భక్తులు వస్తూనే ఉంటారు. ఈ నెల 17వ తేదీ నుండి శ్రావణ మాస ఉత్సవాలు ఆరంభం అవుతున్న నేపథ్యంలో ఉరుకుంద ఈరన్న స్వామి వైభవంపై తెలుగుప్రభ ప్రత్యేక కథనం….

- Advertisement -

కర్నూలు జిల్లా కౌతాళంలో ఉన్న ఉరుకుందలో వెలసిన ఈరన్న స్వామి భక్తులపాలిట కొంగుబంగారంగా అలరారుతున్నారు. కొలిచినవారికి కొలిచినంత అన్నట్టు ఈరన్న స్వామి తనను నమ్ముకున్నవారిని తుదికంటా కాపాడుతున్నారు. కానీ ఈరన్న స్వామికి ఒక నియమం ఉంది. అదేంటంటే ఈరన్న స్వామి ఇంటి దేవుడు అంటే ఇలవేల్పుగా ఉన్న వారు మాత్రమే ఇక్కడి గుడికి రావాలి. లేదంటే స్వామి వెంటబడతాడని ప్రతీతి. ఒకవేళ ఈరన్న స్వామి ఇంటి దేవుడు కాకపోయినా ఇక్కడి గుడికి వస్తే ప్రతి ఏటా ఉరుకుందలోని ఈ ఆలయానికి రావాల్సిందేనని స్థల పురాణం చెబుతోంది.

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి (నరసింహస్వామి) శ్రావణ మాస ఉత్సవాలు ఈనెల 17వ తేదీ గురువారం నుండి ప్రారంభమై, సెప్టెంబర్ నెల 14వ తేదీ గురువారం వరకు దాదాపు నెల రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలలో ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుండే కాక, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి సుదూర ప్రాంతాల నుండి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈరన్న స్వామిని మహా శక్తి గల దేవుడిగా, మహత్తు గల దేవుడిగా భక్తులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఉరుకుంద ప్రసిద్ధ క్షేత్రం. 16 -17 శతాబ్దపు మధ్యకాలంలో సిద్ధ పురుషుడు ఈరన్న స్వామి తన అంతిమ సమయాన్ని ఇక్కడే గడిపాడు. నిప్పులాంటి దేవుడుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. అశ్వత్థ రూపమైన నరసింహ స్వామి ప్రభావం వల్ల క్షేత్రం మహిమాన్వితంగా మారింది. వీరభద్రాంశంతో జన్మించిన సిద్ధ పురుషుడు, శివయోగి ఉరుకుంద ఈరన్న స్వామి… ఇంతటి మహాయోగి నిలిచిన దివ్య స్థలమే ఉరుకుంద.

స్వామివారి పల్లకి ఉత్సవం

ఉత్సవాలలో నాలుగవ సోమవారం సెప్టెంబర్ నెల 11వ తేదీన ఉరుకుంద ఈరన్న స్వామి పల్లకి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు… ప్రతి ఏడాది నాలుగవ సోమవారం స్వామి పల్లకి ఉత్సవాన్ని నిర్వహిస్తారు… తుంగభద్ర నదిలో పుణ్యా స్నానాలు చేసినా అనంతరం ఆయా గ్రామాల మీదుగా స్వామి పల్లకి ఉరుకుంద క్షేత్రానికి చేరుకుంటుంది.

ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ , ఆలయ ఈవో వాణి ఉరుకుంద ఈరన్న స్వామి శ్రావణ మాస ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేశామమన్నారు. స్వామి దర్శనార్థం లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నందున భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంతో పాటు, స్వామి దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.

ప్రత్యేక బస్సు సర్వీసులు

శ్రావణ మాస ఉత్సవాలకు సంబంధించి భక్తుల సౌకర్యార్థం ఆంధ్ర కర్ణాటక ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్ సర్వీస్ లను ఏర్పాటు చేశారు. ఆదోని ఎమ్మిగనూరు డిపోలతో పాటు, కర్ణాటకలోని సిరుగుప్ప రాయచూరు డిపో అధికారులు సైతం ఉత్సవాల సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు. రైలులో తరలివచ్చే భక్తులు కుప్పగల్లు స్టేషన్లో దిగితే అక్కడి నుండి ఉరుకుంద క్షేత్రానికి రవాణా సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News