భారతీయ సంస్కృతిలో ఆచారాలు, సంప్రదాయాలు విశేషమైన ప్రాముఖ్యతను ఉంది. గరుడపురాణం, పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన వ్యక్తి ఆత్మ సమాధానంగా ఉండేలా కొన్ని నియమాలను పాటించడం అవసరం. మృతుల సంస్మరణలో హుందాతనాన్ని పాటించడం మాత్రమే కాకుండా, వారి వస్తువులను ఉపయోగించడంపై కూడా అనేక నమ్మకాలు ఉన్నాయి. ముఖ్యంగా, మరణించిన వారి ఆభరణాలు, దుస్తులు, ఇతర వ్యక్తిగత వస్తువులను వాడకూడదని పండితులు చెబుతున్నారు. ఈ నమ్మకానికి ఆధ్యాత్మిక, ఆచారసంబంధమైన కారణాలు ఉన్నాయి.
చనిపోయిన వారి వస్తువులు వాడితే:
పండితుల అభిప్రాయం ప్రకారం, మరణించిన వ్యక్తి ఆత్మ ఆ వస్తువుల ద్వారా ఆకర్షితమవుతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా వారు ఉపయోగించిన దుస్తులు, ఆభరణాలు, గడియారాలు వంటివి వారి శరీర స్పర్శలో ఉండే కారణంగా, వాటిని ధరించడం వల్ల ఆత్మ లోకాన్ని వీడకుండా తిరుగుతుందని అంటారు. అయితే మరణానికి ముందు వ్యక్తి ఆభరణాలను బహుమతిగా ఇచ్చి ఉంటే, వాటిని వాడుకోవచ్చు.
మరణించిన వ్యక్తి ధరించిన బంగారు ఆభరణాలను అలానే వాడకూడదని అంటారు. అయితే వాటిని కరిగించి కొత్త డిజైన్ చేయించుకుని ధరించవచ్చు. వారి దుస్తులు వాడడం వల్ల ఆత్మ శాంతించకపోవచ్చని నమ్ముతారు. అందుకే వాటిని ఇతరులకు దానం చేయడం లేదా విరాళంగా ఇవ్వడం శ్రేయస్కరం. ఇక గడియారాలు, దువ్వెనలు, షేవింగ్ కిట్లు వంటి రోజువారీ వస్తువులను వాడకుండా వదిలిపెట్టడం మంచిదని సూచిస్తున్నారు. మరణించిన వారి వస్తువులను వినియోగిస్తే, పితృదోషం కలుగుతుందని నమ్మకం కొందరికి ఉంది.
మరణించిన వారి వస్తువులను పూర్తిగా వదిలేయకూడదు. వాటిని తగిన విధంగా ఉపయోగించేందుకు మార్గాలు ఉన్నాయి. ఆభరణాలను కొత్త మోడల్‌కి మార్చుకోవచ్చు, ఉపయోగించదగిన వస్తువులను దానం చేయొచ్చు. అయితే వాటిని ఉపయోగించే ముందు ఆచారాలను పాటించాలనే నమ్మకాలు భారతీయ సంస్కృతిలో కొనసాగుతున్నాయి.