పరమ పవిత్రమైన ముక్కోటి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీలక్ష్మి సమేత నారాయణస్వామి మర్రిగూడెం వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది ఆలయ అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు రాముస్వామి మధు స్వామి ప్రాతః కాల సమయం నుండి సుప్రభాత సేవతో విష్ణు మూర్తులను మేల్కొల్పి ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలు ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో పూలు తులసి మాలలతో వైభవంగా దేవేరులను అలంకరించి అత్యంత వైభవో పేతంగా ప్రత్యేక
పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తర ద్వారా దర్శనం కల్పించడంతో తెల్లవారుజాము నుండే ప్రారంభమైన పూజా కార్యక్రమాలకు వేకువ జామునే లేచి తలంటు స్నానాలు ఆచరించి వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరవడంతో భక్తులకు స్వామివారి దర్శనం లభించడంతో పులకిందులైన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నామార్చనలు జరిపించి తనివితీరా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడాయి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ సోత్ర పారాయణం 108 పర్యాయములు భక్తిశ్రద్ధలతో భక్తులు జపించారు.
గోవింద నామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. ఈ సందర్భంగా అర్చకులు కాండూరి లక్ష్మీనారాయణ చార్యులు మాట్లాడుతూ సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన నుండి మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుందని విష్ణుమూర్తి దక్షిణ యానంలో శయనించి ముక్కోటి ఏకాదశిన ఉత్తర దిశగా మేల్కొంటూ భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజైన శనివారం ముక్కోటి ఏకాదశి రావడం శుభదినమని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ సప్త ద్వారాలు తెచ్చుకొని ఉంటాయని విష్ణువును దర్శించుకోవడంతో భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వారానే వైకుంఠ ద్వారంగా భావించి తెల్లవారుజాము నుండే భగవత్ దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారన్నారు. ఉత్తర ద్వార దర్శనం మండపానికి ఉత్సవ విగ్రహాలకు పూల దండలు కమల్ కుమార్ అగర్వాల్ దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు పెంటాల నాగేశ్వరరావు దంపతులు కందునూరి ఉపేందర్ దంపతులు భక్తులకు తమ చేతుల మీదుగా పులిహోర ప్రసాదాన్ని వితరణ చేసి భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పుల్లఖండం రమేష్ బాబు దంపతులు పుల్ల ఖండం రాంబాబు దంపతులు శ్రీనివాస్ గుప్తా కనక శేఖర్ కట్టా రమేష్ చందా నగేష్ తదితరులు పాల్గొన్నారు.