జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం చారిత్రక వల్మీడీ (వాల్మీకాపురం) గ్రామంలో గుట్ట పైన శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో హోమాలు సాగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారిని ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ఆహ్వానించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, కోడూరు కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్య నిర్వహణ అధికారిని లక్ష్మీప్రసన్, స్థానిక ప్రజా ప్రతినిధులు పూజారులు రుత్వికులు వేద పండితులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
విగ్రహాల ప్రతిష్టాపన అనంతరం మహాప్రసాద వితరణ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామివార్ల కొత్త ఉత్సవ మూర్తులకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.