Saturday, November 23, 2024
HomeదైవంValmidi: వాల్మీకిపురంలో సీతారాముల విగ్రహ పునఃప్రతిష్ఠాపన

Valmidi: వాల్మీకిపురంలో సీతారాముల విగ్రహ పునఃప్రతిష్ఠాపన

జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మీడి (వాల్మీకి పురం) లో శ్రీ సీతారామచంద్ర స్వామి విగ్రహాల పున: ప్రతిష్ఠాపన, దేవాలయ పున: ప్రారంభ కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, శ్రీ లక్ష్మీ సహిత శ్రీ విష్ణు సహస్రనామ, రామ రక్షా స్తోత్ర పారాయణాదులు జరిగాయి. గోపూజ, ప్రతిష్ట అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము నిర్వహించారు. రక్షా బంధనము, ఋత్విక్కరణమ్, దీక్ష వస్త్రాధారణ, అంకురారోపణం వంటి కార్యక్రమాలను వేద పండితులు అత్యంత భక్తి శ్రద్ధలతో, సంప్రదాయ బద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు వాల్మీకి పురం వల్మీడి గ్రామంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి పురాతన దేవాలయం నుండి స్వామి వారి విగ్రహాన్ని మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా కిలోమీటర్ కు పైగా దూరం ఉన్న రాముల వారి గుట్ట మీదకు తీసుకువచ్చారు. ముందుగా గుట్ట మీద ఉన్న స్వామి వారి స్వయంభూ పాత దేవాలయంలోకి తీసుకెళ్ళి పూజాదికాలు నిర్వహించారు. అలాగే, నూతన దేవాలయ ప్రాంగణంలోకి రాముల వారి విగ్రహాన్ని తీసుకువచ్చి, ఆ విగ్రహం ముందు అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు.

- Advertisement -

ఈ కార్యక్రమాలకు జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వారి సతీమణి, ఎర్రబెల్లి ట్రస్టు చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, వారి కుటుంబ సభ్యులు, పాలకుర్తి శ్రీ సోమేశ్వర, లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన చైర్మన్ రామచంద్రయ్య శర్మ, కార్యనిర్వహణ అధికారిణి లక్ష్మీ ప్రసన్న, డీ అర్ డీ ఓ రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, వల్మీడి దేవస్థాన చైర్మన్ జై హింద్, ఆలయ పాలక మండలి సభ్యులు, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రముఖులు, సర్పంచ్ సైదులు, ఎంపీటీసీ సోమనారాయణ, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు ముందుండి ఈ కార్యక్రమాలు అర్చకులతో నిర్వహించారు.

అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్, మంత్రి ఎర్రబెల్లి భక్తులంతా ఈ 4 రోజుల ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. వల్మీడి దేవాలయం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ, కృషితో మహిమాన్వితంగా వెలుగొందుతున్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. భద్రాద్రి దేవాలయం తరహా గుర్తింపును పొందుతుందని చెప్పారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధ్వర్యంలో ఇదే ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కాగా, మొదటి రోజు కార్యక్రమాల అనంతరం నివేదన, మంగళ శాసనం తీర్థ ప్రసాద గోష్టి జరిగింది.

కార్యక్రమాల వివరాలు:
తేదీ 02-09-2023 (జ్యేష్ఠ.. పంచమి, శనివారం)
ఉదయం మంగళ వాయిద్యాలు, సేశాకాలం, 8 గంటలకు ప్రాబోధికి ఆరగింపు, ఉ. 9.00 గం. నుండి స్వస్తి వాచనం, మూర్త కుంభ స్థాపన, ద్వారా తోరనా, ధ్వజ కుంభల్యరాదన, అగ్ని ప్రతిష్ట వాస్తు హోమం, పర్యగ్నికరనాం, నమాలిశస్నపం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నివేదన, మంగళ శాసన, తీర్థ ప్రసాద గోష్టి సాయంత్రం 5.00 గంటలకు మంగళ వాయిద్యాలు శ్రీ లక్ష్మీ విష్ణు సహస్రనామ సహి రామ రక్షా స్తోత్ర పారాయణాధులు, చతుష్టావార్చినీ మూలమంత్ర అధీవాస హోమాలు “జలాధివాసం, క్షీరాదివాసం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు నివేదన, మంగళ శాసనం,తీర్ధ ప్రసాద గోష్టి. తేదీ 03-09-2023 (జ్యేష్ఠ.. షష్టి, ఆదివారం)
ఉదయం మంగళ వాయిద్యా,లు ఉదయం 8 గంటలకు సేశాకాలం, ప్రాబోధ ఆరగింపు, ఉ. 9.00 గం. చతుస్థానార్చన, స్వస్తివాచనం, పంచగవ్యాధివాసం, మృత్తికాదివాసం పంచవింశతా, కలశాభిషేకం, అష్టధాన్యతృష్టి, నాయనోన్మాలినం.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు నివేదన, మంగళ శాసనం, తీర్థ ప్రసాద గోష్టి
సాయంత్రం 5.00 గంటలకు “శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారికి” గ్రామ శివారు నుండి పూర్ణకుంభ స్వాగత సత్కారములతో ఆహ్వానించడం. మంగళ వాయిద్యాలు, శ్రీ లక్ష్మీ విష్ణు సహస్రనామ సహీ రామ రక్షా స్తోత్ర పారాయణాధులు, కళాన్యాసి, మూర్తివ్యాహిమాలు, ధాన్య, ఫల, పుష్ప, శయ్యధివాసం.
రాత్రి 9 గంటలకు నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టి తేదీ 04-09-2023 (జ్యేష్ఠ.. సప్తమి, సోమవారం)


ఉదయం 4 గంటలకు మంగళ వాయిద్యాలు, నిత్య సేవాకాలం, ప్రాబోధికి, ఆరగింపు ఉదయం 7 గంటలకు మహాపూర్ణాహుతి, గర్త విన్యాసం, ఉదయం 7 గం. 30 నిమిషాలకు శతభిష యుక్త మిధున లగ్నమున “శ్రీ చిన్నజీయర్ స్వామివారి కరకమలములచే యంత్ర ప్రతిష్ట, ప్రోక్షాక అన్ని మూర్తులు, ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, దిష్టికుంభ ప్రధమ ఆరాధన, శాత్తమొర్తే. “శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణం, పండిత సన్యాసం, యజపోనులకు, గ్రామస్తులకు, ప్రముఖులకు ఆశీర్వచనం ప్రతిష్టా సమాప్తి.

మధ్యాహ్నం 1.00 గంటలకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News