Varalakshmi Vratam 2025 Significance:హిందూ మహిళలు జరుపుకునే ముఖ్యమైన పండుగ లేదా వ్రతాల్లో వరలక్ష్మీదేవి వ్రతం ఒకటి. నిండు నూరేళ్లు సౌభాగ్యంతోపాటు సంపదను ప్రసాదించాలని ఈరోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకుంటారు. ఈ శుభకరమైన రోజున వరాలిచ్చే దేవతగా లక్ష్మీదేవిని కొలుస్తారు. ముఖ్యంగా ఈ పండుగను సౌత్ ఇండియా రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని స్త్రీలు ఎంతో నిష్టతో చేస్తారు. ఈరోజున ఆ తల్లికి చేసే పూజ.. అష్టలక్ష్మీలకు చేసే పూజఫలంతో సమానం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటూ..భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల కోరుకున్నది సిద్ధిస్తుంది.ఈఏడాది వరలక్ష్మీవ్రతం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
వరలక్ష్మీ వ్రతం తేదీ, ముహూర్తం:
=> హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 8, 2025న వచ్చింది.
=> సింహ లగ్న పూజ ముహూర్తం (ఉదయం): ఉదయం 06:29 – ఉదయం 08:46 వరకు
=> వృశ్చిక లగ్న పూజ ముహూర్తం (మధ్యాహ్నం): మధ్యాహ్నం 01:22 – మధ్యాహ్నం 03:41 వరకు
=> కుంభ లగ్న పూజ ముహూర్తం (సాయంత్రం): రాత్రి 07:27 – రాత్రి 08:54 వరకు
=> వృషభ లగ్న పూజ ముహూర్తం (అర్ధరాత్రి): 11:55 PM – 01:50 AM, ఆగస్టు 9
వరలక్ష్మీ వ్రతం ఎలా జరుపుకోవాలి?
తొలుత విష్నుకర్త అయిన గణపతిని పూజించాలి. అనంతరం’నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే..’ అంటూ లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి. ముందుగా కలశం ఏర్పాటు చసి వరలక్ష్మీ దేవిని ఆవాహన చేయాలి. ఆ తర్వాత షోడశోపచార, అష్టోత్తరశతనామ పూజలు చేయాలి. ధూప, దీప, నైవేద్యాలను తాంబూలాలని సమర్పించి అమ్మవారికి మంగళహారతి పట్టాలి.
ఆ తర్వాత తోరబంధన మంత్రం పఠిస్తూ..ఆ తోరణాన్ని తీసుకుని రక్షణ చిహ్నంగా కుడిచేతి మణికట్టుకు కట్టుకోవాలి. పిండివంటలూ, పండ్లు మెుదలైనవి నైవేథ్యంగా అమ్మవారికి పెట్టాలి. చివరిగా రవిక, పసుపు, కుంకుమ, తాంబూలంతో పాటు ముత్తైదువుని మహాలక్ష్మీగా భావించి వాయనం ఇవ్వాలి. స్థిరమైన లగ్న సమయంలో లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.
Disclaimer: ఈ కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం తదితర అంశాల ఆధారంగా ఈ వార్తను రూపొందించడమైది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.


