HomeదైవంVaralakshmi Vratam: జ్ఞాన సరస్వతి దేవాలయంలో శాస్త్రోక్తంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు 

Varalakshmi Vratam: జ్ఞాన సరస్వతి దేవాలయంలో శాస్త్రోక్తంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు 

నాగర్ కర్నూల్ (తెలుగు ప్రభ): జిల్లా కేంద్రం సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రావణమాస నాల్గవ శుక్రవారం సందర్భంగా వేదమంత్రోఛ్ఛారణల మధ్య సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకారపు విశ్వనాథం ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు నవీన్ కుమార్ మహిళలతో వరలక్ష్మీ వ్రతాలను నిర్వహింపజేశారు. 

- Advertisement -

varalakshmi vratam

ఈ సందర్భంగా నవీన్ కుమార్ వ్రత విశిష్టత వివరించారు. పరమశివుడిని పార్వతి దేవి వరంగా కోరిన వ్రతమే వరలక్ష్మి వ్రతమని అన్నారు. శ్రీ సూక్తం ప్రధానంగా చారుమతి బ్రాహ్మణ మహిళ మొదట ఆచరణతో పూజించి భారతీయులకు అందించిన వరమన్నారు. అమ్మవారిని వివిధ విశేష పూజ ద్రవ్యాలు, ప్రత్యేక మంత్రములతో పూజించిన వారికి అష్టైశ్వర్యాలు వారి కుటుంబం సౌభాగ్యం, ఆరోగ్యంగా ఉంటుందని, ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, వరాలు, అష్టైశ్వర్యాలు పొందుటకు అత్యంత సులభమైన మార్గం వరలక్ష్మి వ్రతమని, శ్రావణమాసంలో మహావిష్ణువు జన్మనక్షత్రమైన శ్రావణ నక్షత్రం లేదా శ్రావణ శుక్రవారం అమ్మవారిని వరలక్ష్మి రూపంలో పూజించడం విశిష్ట పుణ్యఫలితం అందుతుందని వివరించారు. 

varalakshmi vratam puja jnana saraswathi temple

అమ్మవారిని కొలచడం, కొలిచిన వారికి కొంగు బంగారంగా వరాలు ప్రాప్తిస్తుందన్నారు. అనంతరం లలిత సహస్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు ఒకరికి ఒకరు సాంప్రదాయంగా వాయనాలు, పసుపు కుంకుమలు ఇచ్చి పుచ్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం జ్ఞాన సరస్వతి నిత్య అన్నదాన ట్రస్ట్ వారిచే భక్తులకు సామూహిక భోజనాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు వేషాదారులతో ఉట్లు కొట్టారు. 

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎలిమి ఈశ్వరయ్య, కోశాధికారి దొడ్ల ఇందుమతి,  శివశంకర్, బాల కళ్యాణం ఆశ్రమం చైర్మన్ దొడ్ల నారాయణరెడ్డి, భూపాల్ రెడ్డి, నవీన్ కుమార్, కమిటీ సభ్యులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News