అరటి చెట్టులో నారాయణుడు ఉంటాడని హిందువుల విశ్వాసం. అరటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్షీదేవి సమేతంగా శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. దీన్ని పెంచడం వల్ల శుభ ఫలితాలను పొందుతారట. ఇంటి బయట లేదా ఇంటి వెనుక పెంచుకోవచ్చట.
Vasthu Shastra: కొన్ని చెట్లు పెంచడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. అరటి చెట్టు పెంచడం వల్ల కొన్ని పరిణామాలు జరుగుతాయని వాస్తు, జోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అరటి మొక్క ఇంట్లో ఉండొచ్చా? లేదా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి చెట్టులో నారాయణుడు ఉంటాడని హిందువుల విశ్వాసం. అరటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్షీదేవి సమేతంగా శ్రీ మహా విష్ణువు కొలువై ఉంటాడని విశ్వాసం. దీన్ని పెంచడం వల్ల శుభ ఫలితాలను పొందుతారట. ఇంటి బయట లేదా ఇంటి వెనుక పెంచుకోవచ్చట.
అరటి చెట్టును ఎక్కడ పెంచినా సంతోషానికి, శ్రేయస్సుకు లోటుండదట. వైవాహిక జీవితంలో కష్టాలు పోతాయట. పెళ్లికాని మహిళలకు త్వరలో పెళ్లి అవుతుందట. ఇంట్లోని పిల్లలు ఎప్పుడూ సంతోషంగా, కష్టాలకు దూరంగా ఉంటారట.
అరటి చెట్టుకు నీళ్ళు పోసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుదట. అరటి చెట్టును పూజిస్తే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడట. విష్ణువు, లక్ష్మీదేవికి అరటి పండును నైవేద్యంగా పెడితే మంచిదట.
ధనం, ఆహారం, శాంతి, సంపత్తిని అరటి చెట్టు సూచిస్తుంది. అరటి చెట్టు గురు గ్రహానికి కారకం అందువల్ల ఎవరి జాతకంలో గురువు అశుభ స్థితిలో ఉంటాడో వాళ్లు అరటిచెట్టును పూజిస్తే దోషాలు తొలుగుతాయట. దక్షిణ, పడమర దిశల్లో కాకుండా ఇంటికి తూర్పు ఉత్తర దిశల్లోనే నాటాలి.