Thursday, January 22, 2026
HomeదైవంVastu: పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా..?

Vastu: పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే వస్తున్నాయా..?

Vastu Meaning of Sparrows:మన ఇళ్లకు పక్షులు లేదా ఇతర జీవులు రావడం చాలా సాధారణంగా జరిగే విషయం. అయితే ఈ సంఘటనలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పిచ్చుకలు ఇంట్లోకి పదే పదే రావడం చాలామంది గమనిస్తుంటారు. ఒకప్పుడు పల్లెల్లో ఎక్కువగా కనిపించిన పిచ్చుకలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇళ్ల చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిచ్చుకలు ఇంట్లోకి రావడం ఏం సూచిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది.

- Advertisement -

పిచ్చుకలు ప్రశాంతతకు..

వాస్తు శాస్త్రం ప్రకారం పిచ్చుకలు ప్రశాంతతకు శుభతకు సంకేతంగా భావిస్తారు. ఇంట్లోకి పిచ్చుకలు తరచూ రావడం అంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఎక్కువగా ఉందని ఒక నమ్మకం. అలాంటి ఇళ్లలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆదాయ వనరులు పెరగడం ఖర్చుల భారం తగ్గడం వంటి మార్పులు త్వరలో చోటుచేసుకునే సూచనగా దీన్ని భావిస్తారు. అలాగే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుందని కూడా అంటారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/saturn-dhaiya-impact-in-2026-for-sagittarius-and-leo/

జంట పిచ్చుకలు..

పిచ్చుకలు ఒంటరిగా కాకుండా జంటగా ఇంట్లోకి రావడం మరింత ప్రత్యేకంగా చూస్తారు. జంట పిచ్చుకలు ఒక ఇంట్లో కనిపిస్తే ఆ ఇంట్లో త్వరలో శుభకార్యం జరిగే అవకాశం ఉందని వాస్తు విశ్వాసం. వివాహం లేదా సంతానం వంటి శుభవార్తలు వినిపించే కాలం దగ్గరలో ఉందని భావిస్తారు. అందుకే పిచ్చుకలు గూడు కట్టుకోవడం కూడా చెడు లక్షణంగా కాకుండా శుభ సూచకంగానే చూస్తారు.

ఇలాంటి సందర్భాల్లో పిచ్చుకలను భయపెట్టడం లేదా హాని చేయడం సరైంది కాదని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని తరిమివేయడానికి ప్రయత్నించకుండా ఇంటి తలుపులు కిటికీలు కొంతసేపు తెరిచి ఉంచితే అవే బయటకు వెళ్లిపోతాయి. కొందరు వాటికి గింజలు లేదా నీళ్లు అందించడం ద్వారా మరింత మంచి ఫలితాలు కలుగుతాయని కూడా నమ్ముతారు. ఇది మనుషుల్లో దయ భావాన్ని పెంపొందించడమే కాకుండా ప్రకృతితో అనుబంధాన్ని బలపరుస్తుందని చెబుతారు.

పిచ్చుకలు ప్రధానంగా గింజలు చిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రస్తుతం ఈ పక్షుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. పట్టణీకరణ కారణంగా చెట్లు తగ్గిపోవడం పచ్చదనం నశించడం రసాయనాలతో చేసే వ్యవసాయం సెల్ టవర్ల నుంచి వెలువడే తరంగాలు ఇవన్నీ పిచ్చుకల జీవనానికి ముప్పుగా మారుతున్నాయి. శాస్త్రవేత్తల ప్రకారం కృత్రిమ గూళ్లు ఏర్పాటు చేయడం ద్వారా వాటిని కొంతవరకు సంరక్షించవచ్చు. ఇళ్లపై లేదా బాల్కనీల్లో చిన్న గూడు బాక్సులు పెట్టడం పిచ్చుకల సంరక్షణకు సహకరిస్తుంది.

కాకిని పితృదేవతల..

పిచ్చుకలతో పాటు ఇతర పక్షులు లేదా జీవులు ఇంటి పరిసరాల్లో కనిపించినప్పుడు కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని అర్థాలు చెబుతారు. ఉదాహరణకు కాకి. మన సంప్రదాయంలో కాకిని పితృదేవతల రూపంగా భావిస్తారు. ఇంటి వద్దకు కాకి రావడం లేదా వాలడం శుభమేనని పెద్దలు చెబుతుంటారు. కాకికి ఆహారం పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని అలాగే శని సంబంధిత సమస్యలు తగ్గుతాయని ఒక విశ్వాసం ఉంది. శని భగవానుడి వాహనంగా కాకిని భావిస్తారు కాబట్టి దాని రాకను మంచి సంకేతంగా చూస్తారు.

గుడ్లగూబ విషయంలో..

గుడ్లగూబ విషయంలో చాలామందికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. కొంతమంది దాన్ని అశుభంగా భావించినా వాస్తు శాస్త్రం ప్రకారం గుడ్లగూబ కనిపించడం శుభ ఫలితాలను సూచిస్తుందని చెబుతారు. ఇంటి పరిసరాల్లో గుడ్లగూబ ఉండటం లేదా ఇంట్లోకి రావడం సంపద పెరుగుదలకు సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో స్థిరత్వం రావడానికి ఇది సూచనగా చెబుతారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-tips-about-hanging-items-behind-house-doors/

పాము ఇంట్లోకి రావడం..

పాము ఇంట్లోకి రావడం విషయానికి వస్తే చాలామంది భయపడిపోతారు. అయితే వాస్తు శాస్త్రంలో దీనికీ ఒక ప్రత్యేక అర్థం ఉంది. పాము రాకను లక్ష్మీదేవి కటాక్షంగా కొందరు భావిస్తారు. ఇది శుభ సూచకమేనని వాస్తు నిపుణులు చెబుతారు. అయితే పాము విషజంతువు కావడం వల్ల దానిని నిర్లక్ష్యం చేయకూడదు. దాన్ని చంపేందుకు ప్రయత్నించడం తప్పు అని అంటారు. పాములను పట్టుకునే నిపుణులను పిలిచి అవి అడవిలోకి సురక్షితంగా వెళ్లేలా చూడడమే సరైన మార్గంగా సూచిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News