Saturday, November 15, 2025
HomeదైవంVastu: మీ ఇంటి ముందు ఈ మొక్కలు ఉంటే వెంటనే పీకి పారేయండి!

Vastu: మీ ఇంటి ముందు ఈ మొక్కలు ఉంటే వెంటనే పీకి పారేయండి!

House Entrance Vastu: ఇళ్ల నిర్మాణంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇల్లు ఎటు ముఖంగా ఉండాలి, గదుల అమరిక ఎలా ఉండాలి, ఏ దిశలో ఏ గది ఉండాలి అనే విషయాలతో పాటు ఇంటి ప్రధాన ద్వారం కూడా వాస్తు ప్రకారం అత్యంత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇంటి గడప అనేది సానుకూల శక్తి ప్రవేశానికి మార్గమని, అదే సమయంలో ప్రతికూల శక్తులు కూడా అక్కడి నుంచే వస్తాయని భావిస్తారు. అందువల్ల ద్వారం ఎదుట ఉండే వాతావరణం, ఆ పరిసరాల్లో ఉండే మొక్కలు, చెట్లు, వాటి ప్రభావం అన్నీ ఇంటి లోపల శ్రేయస్సును ప్రభావితం చేస్తాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

కలహాలు, ఆరోగ్య సమస్యలు..

వాస్తు ప్రకారం కొన్ని ప్రత్యేకమైన మొక్కలు, చెట్లు ఇంటి ముందర పెట్టడం మానుకోవాలని చెబుతున్నారు. వీటిని పెంచితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్య సమస్యలు, శాంతి లోపం వంటి పరిస్థితులు వస్తాయని చెప్పబడుతోంది. అందువల్ల ఏ మొక్కలు ప్రధాన ద్వారానికి దగ్గరగా ఉండకూడదో తెలుసుకోవడం చాలా అవసరం.

రావి చెట్టు..

మొదటగా రావి చెట్టు గురించి మాట్లాడుకుంటే, దీనిని చాలా మంది పవిత్రంగా భావించి వివిధ ఆచారాలలో ఉపయోగిస్తారు. కానీ వాస్తు దృష్ట్యా ఈ చెట్టు ఇంటి ముందర ఉండకూడదని చెబుతున్నారు. రావి చెట్టు ఇంటి ఎదుట ఉంటే కుటుంబ పురోగతి ఆగిపోతుందని, సానుకూల శక్తి అడ్డుకుపోతుందని నిపుణుల అభిప్రాయం. అందువల్ల ఈ చెట్టును ఇంటి గడప దగ్గర నాటడం మంచిది కాదని సూచిస్తున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/navaratri-lamp-lighting-rituals-and-their-significance-explained/

ముళ్ల మొక్కలను…

ఇక చాలా మంది అలంకరణ కోసమే ముళ్ల మొక్కలను ఇంటి ముందు ఉంచుతారు. కాటస్ వంటి మొక్కలు అందంగా కనిపించినప్పటికీ ఇవి వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల ప్రభావాన్ని తెస్తాయి. ముళ్ల మొక్కలు ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే కుటుంబంలో కలహాలు పెరుగుతాయని, వాతావరణం ఉద్రిక్తతతో నిండిపోతుందని అంటున్నారు. అంతేకాదు ఇవి ప్రతికూల శక్తిని ఆకర్షించే స్వభావం కలిగివున్నాయి.

బోన్సాయ్ మొక్కలు…

ఇక బోన్సాయ్ మొక్కల విషయానికి వస్తే, ఇవి చాలా అందంగా కనిపిస్తాయి. చిన్నపాటి చెట్ల మాదిరిగా ఉండే ఈ మొక్కలు చాలా మందిని ఆకర్షిస్తాయి. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం బోన్సాయ్ మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం ఎదుట ఉంచడం సరికాదని సూచిస్తున్నారు. చిన్న పరిమాణంలో ఉండే ఈ చెట్లు పురోగతిని నిరోధిస్తాయని, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడతాయని అంటున్నారు.

తులసి మొక్కను..

ఇంటి ముందు తులసి మొక్కను చాలా మంది పవిత్రంగా భావించి పెంచుతారు. కానీ అది ఎండిపోతే లేదా ఎండిపోయిన తులసి మొక్కను ప్రధాన ద్వారం ఎదుట ఉంచితే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి సహా ఎండిపోయిన ఏ మొక్క అయినా ఇంటి ముందర ఉంచడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది ఇంట్లో శాంతి తగ్గడానికి, ప్రతికూల శక్తి పెరగడానికి కారణమవుతుందని నమ్మకం.

Also Read: https://teluguprabha.net/devotional-news/tulsi-plant-vastu-rules-for-home-prosperity-and-health-benefits/

చింత చెట్టు ..

చింత చెట్టు కూడా ఇళ్ల దగ్గర పెంచకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంటే మరీ మంచిది కాదని అంటున్నారు. చింత చెట్టు వలన ఇంటిలో సానుకూల శక్తి తగ్గి, వాతావరణం ప్రతికూలంగా మారుతుందని విశ్వాసం.

పత్తి చెట్టు

పత్తి చెట్టు గురించి కూడా వాస్తు నిపుణులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు. చాలా మంది పత్తి చెట్టును ఇంటి ముందు పెడతారు. కానీ ఈ చెట్టు ప్రధాన ద్వారం ఎదురుగా ఉంటే అనారోగ్యం, మరణ భయం, అవసరం లేని ఖర్చులు పెరుగుతాయని చెబుతున్నారు.

పండ్ల చెట్లు

అలాగే పండ్ల చెట్లు ప్రధాన ద్వారం ఎదుట ఉండకూడదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. వీటి వలన కుటుంబంలో సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుందని అంటారు. జిల్లేడు చెట్టు కూడా ఇదే తరహాలో ప్రతికూల ప్రభావం కలిగిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad