Saturday, November 15, 2025
HomeదైవంVastu: ఈ వస్తువులు పొరపాటున కూడా ఎవరికి ఊరికే ఇవ్వొద్దు..తీసుకోవద్దు!

Vastu: ఈ వస్తువులు పొరపాటున కూడా ఎవరికి ఊరికే ఇవ్వొద్దు..తీసుకోవద్దు!

Vastu Rules:మన జీవితంలో చిన్నచిన్న అలవాట్లు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. మనం ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని వస్తువులు, డబ్బు ఇవ్వకుండా తీసుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తులు చేరుతాయని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం ఆర్థిక ఇబ్బందులకు మాత్రమే కాకుండా, కుటుంబంలో కలహాలు, మానసిక ఒత్తిడి, దురదృష్టం వంటి సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని వస్తువులను డబ్బు లేకుండా ఇవ్వడం లేదా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో చూద్దాం.

- Advertisement -

ఉప్పు..

ఇంట్లో ఉప్పు అయిపోతే చాలా మంది పొరుగింటి నుంచి లేదా బంధువుల దగ్గర నుంచి తీసుకుని వాడటం సాధారణంగా కనిపించే అలవాటు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇది పెద్ద తప్పు. ఉప్పు శనిగ్రహంతో సంబంధం ఉన్నదని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. ఎవరైనా ఉప్పును ఉచితంగా ఇస్తే లేదా తీసుకుంటే, శనిదేవుని కోపానికి గురవుతారని నమ్మకం ఉంది. ఇది ఆరోగ్య సమస్యలు, అప్పులు, మానసిక ఇబ్బందులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఉప్పును ఎప్పుడూ డబ్బు చెల్లించి కొనడం అవసరమని చెబుతున్నారు.

Also  Read:https://teluguprabha.net/devotional-news/clay-pot-in-home-brings-health-peace-and-prosperity/

పెరుగు..

పెరుగు విషయానికి వస్తే, సాధారణంగా మనం కొత్త పెరుగు చేయడానికి కొద్దిగా పెరుగు పొరుగింటి నుంచి తీసుకుంటాం. కానీ వాస్తు నిపుణులు ఇది చేయకూడదని చెబుతున్నారు. పెరుగు ఇంటికి ఉచితంగా తీసుకురావడం వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి, డబ్బు వృథా అవుతుంది, ఇంట్లో సఖ్యత తగ్గిపోతుందని జ్యోతిష్య గ్రంథాలు పేర్కొన్నాయి. అందువల్ల నేటి కాలంలో చాలామంది డబ్బు చెల్లించి మార్కెట్ నుంచి పెరుగు ప్యాకెట్లు కొనడం అలవాటు చేసుకున్నారు.

నల్లనువ్వులు..

నల్లనువ్వులు కూడా ఉచితంగా ఎవరికీ ఇవ్వకూడదు, తీసుకోకూడదు అని వాస్తు చెబుతోంది. రాహు, కేతు, శనితో నల్లనువ్వుల సంబంధం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. డబ్బు లేకుండా నల్లనువ్వులు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల అవసరం లేని ఖర్చులు వస్తాయి, ఆర్థిక స్థితి దెబ్బతింటుంది. ముఖ్యంగా శనివారాల్లో ఇది చేయకూడదని ప్రత్యేకంగా సూచిస్తున్నారు.

సూది..

సూది అనే చిన్న వస్తువు కూడా ఇంట్లో ప్రతికూల ప్రభావాన్ని కలిగించగలదని గ్రంథాలు చెబుతున్నాయి. సూదిని ఉచితంగా తీసుకోవడం వలన కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గిపోతుంది, విభేదాలు పెరుగుతాయి. సూది ఒక రకంగా దానమని పరిగణిస్తారు, కాబట్టి దాన్ని డబ్బు లేకుండా స్వీకరించడం అనవసర ఇబ్బందులకు దారి తీస్తుందని చెబుతారు.

నూనె..

నూనెను కూడా ఎప్పుడూ డబ్బు చెల్లించకుండా తీసుకోకూడదు. నూనెను దానం రూపంలో తీసుకోవడం దురదృష్టానికి కారణమవుతుందని విశ్వసిస్తారు. వాస్తు ప్రకారం ఇది జీవితంలో సమస్యలు పెరగడానికి దారి తీస్తుంది. అయితే జాతకంలో శని బలహీనంగా ఉంటే ఆవ నూనెలో వండిన ఆహారం తినడం మంచిదని చెబుతారు. కానీ నూనెను ఉచితంగా స్వీకరించడం మాత్రం ప్రతికూల ఫలితాలు ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు.

ఇనుము..

ఇనుము విషయానికొస్తే, ఇది కూడా శనితో సంబంధం ఉన్న వస్తువుగా పరిగణించబడుతుంది. ఎవరినుంచైనా డబ్బు చెల్లించకుండా ఇనుమును తీసుకోవడం శని ప్రభావాన్ని మరింత ప్రతికూలంగా మారుస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శనివారం ఇనుమును ఎవరి నుంచి అయినా తీసుకోవడం శని దేవుని కోపానికి దారి తీస్తుందని గ్రంథాలు పేర్కొన్నాయి. అయితే శని సాడే సతి ప్రభావంలో ఉన్నవారు శనివారం ఇనుమును దానం చేయవచ్చని చెబుతారు.

రుమాలు..

ఇంకా రుమాలు విషయానికొస్తే, దీనిని ఉచితంగా ఇవ్వడం లేదా తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. రుమాలను బహుమతిగా ఇచ్చినా, ఊరికే తీసుకున్నా, కుటుంబంలో తగాదాలు, గొడవలు పెరిగి మానసిక అశాంతి కలుగుతుందని నమ్మకం ఉంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/navratri-rituals-to-bring-prosperity-and-happiness/

అగ్గిపెట్టె..

అగ్గిపెట్టెను కూడా డబ్బు చెల్లించకుండా ఎవరి దగ్గరా తీసుకోవడం వాస్తు శాస్త్రం ప్రకారం తప్పు. అగ్గిపెట్టె అగ్ని దేవునితో సంబంధం ఉన్నదని చెబుతారు. దీన్ని ఉచితంగా తీసుకుంటే స్నేహితుల, బంధువుల మధ్య కోపాలు, విభేదాలు పెరుగుతాయి. ఇంట్లో శాంతి తగ్గిపోతుంది, అనవసర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad