Sunday, November 16, 2025
HomeదైవంPooja Room: పొరపాటున కూడా ఈ దేవుళ్ళ విగ్రహాలను ఇంట్లో పెట్టవద్దు.. ఎందుకంటే..

Pooja Room: పొరపాటున కూడా ఈ దేవుళ్ళ విగ్రహాలను ఇంట్లో పెట్టవద్దు.. ఎందుకంటే..

Pooja Room Vs Vastu: ఇంటి పూజా గది ఆధ్యాత్మికత, శాంతి, సానుకూల శక్తికి ప్రతీకగా భావించబడుతుంది. ఇక్కడ చేసే పూజ, ధ్యానం కుటుంబ సభ్యులకు మానసిక ప్రశాంతతని కలిగిస్తుందని నమ్మకం. అందుకే ఈ ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రముగా, పవిత్రంగా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. వాస్తు శాస్త్రం పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు ఉంచాలో, వేటిని ఉంచకూడదో స్పష్టంగా చెబుతుంది. ఈ నియమాలు పాటిస్తే ఇంట్లో సౌఖ్యం, శాంతి నెలకొంటాయని విశ్వాసం ఉంది.

- Advertisement -

ప్రతిరోజూ శుభ్రపరచడం..

పూజ గదిని ప్రతిరోజూ శుభ్రపరచడం, ధూళి లేకుండా ఉంచడం ప్రధాన కర్తవ్యం. ఈ స్థలంలో విగ్రహాల సంఖ్య ఎక్కువ కాకుండా పరిమితంగానే ఉంచాలని వాస్తు నిపుణులు సూచిస్తారు. ఎక్కువ విగ్రహాలు పెడితే ఆ ప్రదేశం అస్తవ్యస్తంగా మారి పవిత్రత తగ్గిపోతుంది. అలాగే విగ్రహాలను ఎప్పుడూ శుభ్రమైన ప్రదేశంలోనే అమర్చాలి.

రాధా కృష్ణ విగ్రహాన్ని..

వాస్తు శాస్త్రం ప్రకారం రాధా కృష్ణ విగ్రహాన్ని పూజా గదిలో ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది ప్రేమ, అనురాగం, కుటుంబ సామరస్యానికి చిహ్నంగా భావించబడుతుంది. ముఖ్యంగా రాబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఇలాంటి విగ్రహాన్ని పూజించడం మరింత శ్రేయస్సు తీసుకొస్తుందని చెబుతారు.

బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడి..

అయితే, శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని,  శివలింగాన్ని ఒకే చోట పెట్టరాదు. ఎందుకంటే వీరికి చేసే ఆరాధన విధానం వేర్వేరుగా ఉంటుంది. ఒకే ప్రదేశంలో ఉంచడం వాస్తు నియమాలకు సరిపడదని చెబుతారు. అదే విధంగా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడి విగ్రహాలను లేదా చిత్రాలను కలిపి ఇంట్లో ఉంచడం కూడా అనుకూలంగా పరిగణించబడదు.

వివాహిత జంటలు తమ పడక గదిలో హనుమంతుడి విగ్రహం లేదా చిత్రం పెట్టుకోవడం మంచిది కాదని వాస్తు సూచిస్తుంది. హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో ఆయన విగ్రహాన్ని ప్రత్యేకంగా పూజా స్థలంలోనే ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.

మరణించిన వారి చిత్రాలు..

ఇంటి పూజా గదిలో మరణించిన కుటుంబ సభ్యుల చిత్రాలు లేదా విగ్రహాలను ఉంచకూడదు. అలాంటివి ఈ పవిత్ర స్థలంలోని శక్తిని ప్రభావితం చేస్తాయి. వారిని స్మరించుకోవడానికి వేరే ప్రదేశం ఉంచుకోవచ్చు కానీ పూజా గది కోసం మాత్రం అనుకూలం కాదు.

ఉగ్ర స్వభావం కలిగిన దేవతల విగ్రహాలు..

అలాగే పూజ గదిలో ఉగ్ర స్వభావం కలిగిన దేవతల విగ్రహాలు లేదా చిత్రాలు ఉంచకూడదు. కాళికాదేవి, శనీశ్వరుడు, రాహువు, కేతువు వంటి దేవతలకు ప్రత్యేక పూజా విధానాలు ఉన్నాయి. వీరిని పూజించడానికి ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయడం మంచిది. ఇంటి ఆలయంలో ఇలాంటి విగ్రహాలను ఉంచితే పాజిటివ్ ఎనర్జీకి ఆటంకం కలుగుతుందని భావిస్తారు.

వాస్తు ప్రకారం పూజా గదిలో దేవుళ్ల విగ్రహాలు ఎల్లప్పుడూ శాంతి, ఆనందం, ఆశీర్వాదం ఇచ్చే భంగిమలో ఉండాలి. కోపంగా లేదా విధ్వంస రూపంలో కనిపించే విగ్రహాలను ఈ స్థలంలో పెట్టకూడదు. ఎందుకంటే ఈ ప్రదేశం కుటుంబానికి మానసిక స్థిరత్వాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడింది. కాబట్టి ప్రశాంతతను ప్రతిబింబించే దేవతల విగ్రహాలు మాత్రమే ఉంచడం మంచిది.

Also Read: https://teluguprabha.net/devotional-news/krishna-janmashtami-2025-zodiac-signs-blessed-by-lord-krishna/

మొత్తంగా చూస్తే పూజా గది పవిత్రతను కాపాడుకోవడం కోసం కొన్ని సులభమైన నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ శుభ్రపరచడం, విగ్రహాలను సక్రమంగా ఉంచడం, వాస్తు సూచించిన విధంగా ఎంపిక చేయడం ద్వారా ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం నిలబెట్టుకోవచ్చు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad