Saturday, November 15, 2025
HomeదైవంSpiritual: పూజ గదిలో ఈ తప్పులు చేస్తున్నారా..జాగ్రత్త!

Spiritual: పూజ గదిలో ఈ తప్పులు చేస్తున్నారా..జాగ్రత్త!

Vastu-Puja Room:మన ఇంట్లో పూజ గది ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఈ స్థలం ఇంటికి మంచి శక్తిని అందించడంతో పాటు కుటుంబ సభ్యుల మనసుకు ప్రశాంతతను ఇస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. అయితే పూజ గది వాస్తు నియమాలకు విరుద్ధంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. అందుకే పూజ గదిని ఏర్పరుస్తూ కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం చాలా అవసరం.

- Advertisement -

పూజ గది ఇంట్లో ఏ ప్రదేశం…

పూజ గది ఇంట్లో ఏ ప్రదేశంలో ఉండాలో తెలుసుకోవడం వాస్తులో చాలా కీలకమైన అంశం. ఈశాన్యం దిశను వాస్తు ప్రకారం అత్యుత్తమమైన ప్రదేశంగా సూచిస్తున్నారు. ఈ దిశలో పూజ గది ఏర్పాటు చేస్తే ఇంట్లో శుభఫలితాలు కలుగుతాయి. ఒకవేళ అది సాధ్యంకాకపోతే తూర్పు లేదా ఉత్తర భాగంలో గది ఏర్పాటు చేయవచ్చు. కానీ దక్షిణ దిశలో పూజ గది పెట్టడం వాస్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదని చెప్పబడింది. ఆ ప్రదేశంలో గది ఉంటే ఇంట్లోకి ప్రతికూల శక్తులు వస్తాయని, సమస్యలు పెరుగుతాయని విశ్వాసం ఉంది.

విగ్రహాలను ఎలా అమర్చాలో…

పూజ గదిలో విగ్రహాలను ఎలా అమర్చాలో కూడా వాస్తు శాస్త్రం స్పష్టంగా చెప్పింది. దేవుళ్ల విగ్రహాలను తూర్పు లేదా పడమర వైపు చూడేలా ఉంచడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. విగ్రహాలను గోడకు పూర్తిగా ఆనకుండా కొంత దూరం పెట్టడం మంచిదని అంటారు. దీనివల్ల ధూపం, దీపం వాసన గదిలో సరిగా వ్యాపిస్తుంది. అలాగే రెండు విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా ఉంచడం అనుకూలం కాదని వాస్తు హెచ్చరిస్తుంది.

రంగులు వేసేటప్పుడు..

పూజ గది గోడలకు రంగులు వేసేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ముదురు నీలం లేదా నలుపు రంగులు వాడితే ప్రతికూల శక్తి పెరుగుతుందని చెబుతారు. అందువల్ల తెలుపు, లేత పసుపు లేదా క్రీమ్ వంటి మృదువైన రంగులను ఉపయోగించడం ఉత్తమం. ఇవి గదిలో శాంతి వాతావరణాన్ని తీసుకువస్తాయి.

ధూపం, దీపం, నూనె, పుస్తకాలు..

పూజా సామాగ్రిని ఎక్కడ ఉంచాలో కూడా వాస్తులో నియమాలు ఉన్నాయి. ధూపం, దీపం, నూనె, పుస్తకాలు వంటి వస్తువులను పశ్చిమ గోడ వైపు ఉంచడం మంచిదని చెబుతారు. విగ్రహాలపై ఏ వస్తువులు పెట్టరాదు. గదిలో సహజ కాంతి బాగా రావడం చాలా ముఖ్యం. తగినంత వెలుతురు వస్తే ఇంట్లోని అడ్డంకులు, దురదృష్టం తొలగిపోతాయని విశ్వాసం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/october-planetary-yogas-bring-fortune-to-three-zodiac-signs/

పూజ గదిలో శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. గది ఎప్పుడూ సువ్యవస్థితంగా ఉండాలి. దుమ్ము పేరుకుపోవడం, పగిలిన విగ్రహాలను అక్కడ ఉంచడం వాస్తు దోషంగా పరిగణిస్తారు. గదిని తరచుగా శుభ్రం చేయడం, విగ్రహాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరిగి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad