Tortoise Vastu Tips in Telugu: మనలో చాలా మంది అలంకరణ కోసమో లేదా వాస్తు దృష్ట్యానో ఇళ్లలో రకరకాల ఫోటోలు, విగ్రహాలు పెడతారు. హిందువుల్లో ఎక్కువ మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఏ పని మెుదలు పెట్టాలన్నా, శుభకార్యం చేయాలన్నా వాస్తును చూస్తారు. ఇళ్లలో లేదా ఆఫీసుల్లో వాస్తు దోషాలు ఉన్నవారు దానికి తగిన పరిహారాలు చేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే నిపుణులు ఫోటోలు, విగ్రహాలు ఇళ్లల్లో నిపుణులు పెట్టమంటారు.
సాధు జీవి అయిన తాబేలుకు వాస్తు శాస్త్రంలో పవిత్రమైన స్థానం ఉంది. హిందువులు తాబేలును విష్ణువు యెుక్క కూర్మ అవతారంగా భావించి పూజిస్తారు. క్షీరసాగర మథనంలో తాబేలు మంథర పర్వతాన్ని తన వీపుపై మోసి అమృతాన్ని తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించింది. తాబేలును చాలా మంది శుభసూచకంగా భావిస్తారు. దీని బొమ్మ లేదా విగ్రహం ఇంట్లో ఉంటే ఆనందంతోపాటు శ్రేయస్సు ఉంటుంది. అంతేకాకుండా సుఖసంతోషాలు అష్టైశ్వరాలు కలుగుతాయని నమ్ముతారు. మీరు వాస్తు దోషాలతో ఇబ్బంది పెడుతుంటే వాటిని తొలగించడానికి ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచుతారు. ఇంట్లో తాబేలు బొమ్మ లేదా ఐడల్ ఉంచడం వల్ల కలిగి లాభాలు ఏంటో తెలుసుకుందాం.
తాబేలుతో లాభాలు!
ఇంట్లో బంగారం, వెండి, ఇత్తడి లేదా లోహంతో చేసిన తాబేలు బొమ్మ లేదా విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. తాబేలు బొమ్మ మీకు లక్ తోపాటు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. దీని కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తాబేలు శాంతికి, ప్రశాంతతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇది ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. మీరు దీర్ఘాయువును పొందుతారు. అన్ని రకాల వ్యాధుల నుండి బయటపడతారు. దీని వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే ఇంట్లో తాబేలు బొమ్మ ఏ దిశలో ఉంటే మీకు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ దిశలో ఉంచాలో తెలుసా?
ఈ భూమ్మీద ఎక్కువ కాలం జీవించే జీవుల్లో తాబేలు ఒకటి. దీనిని ప్రశాంతతకు మారు పేరుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, తాబేలు బొమ్మను ఎల్లప్పుడూ ఇంటి ఉత్తరం లేదా వాయువ్య దిశలో ఉంచడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు. ఆర్థికంగా లాభపడతారు. మీ ఇంట్లోని పూజ గదిలో తాబేలు బొమ్మను నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు.
Also Read: Pradosh vrat 2025 – భౌమ ప్రదోష వ్రతం డిసెంబర్ 02నా లేదా 03నా?
ప్లాస్టిక్ లేదా ఇతర చౌకైన వస్తువులతో చేసిన తాబేలు బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒక వేళ తాబేలు స్టాచ్యూను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచినట్లయితే దాని ముఖం ఎల్లప్పుడూ ఇంటి లోపలికి ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ లోపలకి వస్తుంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. పండితులు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ వార్తకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు. దీనిని పాటించే ముందు వాస్తు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

