Saturday, November 15, 2025
HomeదైవంVastu Tips: నిద్రపోయేటప్పుడు ఈ 5 వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన ఉంచుకోకండి.. లేకపోతే అంతే..!

Vastu Tips: నిద్రపోయేటప్పుడు ఈ 5 వస్తువులు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన ఉంచుకోకండి.. లేకపోతే అంతే..!

Vastu Tips for Bedroom: మనలో చాలా మంది వాస్తు చూడనిదే ఏ పని చేయరు. ఇల్లు కట్టాలన్నా, ఏదైనా నిర్మాణం చేయాలన్న వాస్తును చూస్తారు. ఇది మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాస్తును పాటిస్తే మన జీవితంలో సంతోషం, శాంతి రెండూ ఉంటాయి. బెడ్ రూమ్ కు సంబంధించి కొన్ని చిట్కాలు వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. నిద్రపోయేటప్పుడు కొన్ని వస్తువులను దగ్గరగా ఉంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పడకగదిలో పడుకునే ముందు మర్చిపోకూడని ఐదు విషయాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

డిజిటల్ వస్తువులు
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో మెుబైల్ ఉంటుంది. మరికొందరు ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ కూడా వాడతారు. పడుకునే ప్రదేశంలో ఇవి ఉంచడం వల్ల మీ ఆరోగ్యం ప్రభావితమవుతుంది. మానసికంగా కృంగిపోతారు. దీని కారణంగా ఎలక్ట్రానిక్స్ వస్తువులను మంచానికి దూరంగా ఉంచండి.

పాదరక్షలు
బెడ్ రూమ్ లో చెప్పులు లేదా షూలు ఉంచడం మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. పడకగదిలో వీటిని ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే వాటిని ఎల్లప్పుడూ గది వెలుపల ఉంచేందుకు ప్రయత్నించండి.

పుస్తకాలు లేదా డైరీలు
రాత్రి నిద్రపోయే ముందు చాలా మందికి పుస్తకాలు చదవడం, డైరీలు రాయడం అలవాటు ఉంటుంది. కొంత మంది వాటిని పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. ఇలా చేయడం సరికాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి పడుకునే ముందు వాటిని సరైన ప్రదేశంలో ఉంచడం మంచిది.

Also Read: Amavasya 2025 – ఈ ఏడాది మార్గశిర అమావాస్య ఎప్పుడు? ఈరోజున శ్రీమహావిష్ణువును ఎందుకు పూజిస్తారు?

గోడ గడియారం
వాస్తు శాస్త్రం ప్రకారం, పడుకునేముందు తల దగ్గర గోడపై గడియారాన్ని ఉంచడం మంచిది కాదు. ఇది మీ ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని ప్రభావితం చేసి నెగిటివ్ ఎనర్జీని నింపుతుంది. దీంతో మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీరు టైం చూసుకోవాలంటే నిద్రపోయే ప్రదేశం నుండి కొంచెం దూరంగా పెట్టుకోండి.

పర్సు
చాలా మంది రాత్రి పూట నిద్రపోయే స్థలంలో పర్స్ ను ఉంచుతారు. కానీ వాస్తు ప్రకారం, ఇది సరైన పద్దతి కాదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వచ్చి వెళ్లిపోతుంది. మీరు భారీగా డబ్బును కోల్పోయే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. పర్సును పెట్టాలనుకుంటే కొంచె దూరంగా మంచి ప్రదేశంలో ఉంచండి.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad