Saturday, November 15, 2025
HomeTop StoriesVastu Tips: మీ ఇంటి మెట్ల సంఖ్య జీరో తో ముగుస్తుందా..అయితే ఈ కష్టాలు తప్పవు!

Vastu Tips: మీ ఇంటి మెట్ల సంఖ్య జీరో తో ముగుస్తుందా..అయితే ఈ కష్టాలు తప్పవు!

Vastu Tips for Staircase:ఇంటి నిర్మాణంలో చాలామంది బయట రూపానికి, గోడల రంగులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు కానీ మెట్ల స్థానం, దిశ వంటి అంశాలను నిర్లక్ష్యం చేస్తుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల ఏర్పాటుకు ప్రత్యేకమైన నియమాలు ఉంటాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటిని పాటిస్తే ఇంటిలో శాంతి, ఆనందం, సంపద పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చిన్న విషయాలుగా కనిపించినా మెట్ల దిశ, రంగు, సంఖ్య, స్థానం వంటివి ఇంటి శక్తి ప్రసరణపై పెద్ద ప్రభావం చూపుతాయి.

- Advertisement -

మెట్లు సవ్యదిశలో..

ఇంటి లోపల మెట్లు సవ్యదిశలో ఉండడం అత్యంత ముఖ్యం. అంటే తూర్పు నుండి పడమర లేదా ఉత్తరం నుండి దక్షిణ దిశగా తిరిగేలా నిర్మిస్తే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపసవ్య దిశలో మెట్లు నిర్మిస్తే ఇంట్లో వృత్తి ప్రగతి అడ్డంకులు ఎదుర్కొనే అవకాశాలుంటాయని నిపుణులు వివరిస్తున్నారు. సవ్యదిశలో ఉన్న మెట్లు శుభప్రభావాన్ని కలిగిస్తాయి, గృహంలో సానుకూల శక్తిని పెంచుతాయని పండితులు చెబుతున్నారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/brahma-rajayoga-brings-luck-to-four-zodiac-signs-before-diwali/

మెట్లు ఎక్కడ నిర్మించాలంటే..

ఇంటి లోపల లేదా వెలుపల మెట్లు ఎక్కడ నిర్మించాలనే విషయంలో కూడా వాస్తు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉంటాయి. సాధ్యమైనంతవరకు మెట్లు ఇంటి దక్షిణం, నైరుతి లేదా పశ్చిమ భాగంలో ఉండేలా చూడాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మిస్తే ఆర్థిక నష్టం వచ్చే అవకాశముందని చెబుతారు. ఈశాన్యం పవిత్రమైన భాగంగా పరిగణించబడుతుంది కాబట్టి ఆ ప్రదేశం ఖాళీగా ఉంచడం శ్రేయస్కరం.

స్పైరల్ లేదా గుండ్రని మెట్లు…

ఇంటి అందాన్ని పెంచేందుకు చాలామంది స్పైరల్ లేదా గుండ్రని మెట్లు వేస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధమైన ఆకృతి శుభప్రభావాన్ని తగ్గించి, ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ విధమైన మెట్లు నివాసితుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందువల్ల సాధారణ సవ్యదిశలో ఉన్న మెట్లు నిర్మించడం ఉత్తమం.

మెట్ల సంఖ్య కూడా వాస్తు దృష్ట్యా ముఖ్యమైన అంశం. బేసి సంఖ్యలో ఉన్న మెట్లు, అంటే 9, 15, 21 లాంటి సంఖ్యలతో ముగియే మెట్లు శ్రేయస్సు, అదృష్టాన్ని తెస్తాయని నమ్మకం ఉంది. దశల సంఖ్య సున్నాతో ముగియకూడదు. సున్నాతో ముగిసే మెట్లు శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని భావిస్తారు.

మధ్యభాగం అంటే బ్రహ్మస్థానం…

ఇంటి మధ్యభాగం, అంటే బ్రహ్మస్థానం అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో ఎటువంటి బరువైన నిర్మాణాలు, మెట్లు ఉండకూడదు. వాస్తు ప్రకారం ఈ ప్రాంతం నుండి కనీసం ఒకటి నుండి రెండు మీటర్ల దూరంలో మెట్లు ఉండాలి. ఇలాంటి అమరికతో ఇంట్లో శక్తి సమతుల్యం స్థిరంగా ఉంటుంది.

ఇంటి లోపల మెట్లు ఎప్పుడూ ఒక పక్కనే ఉండేలా నిర్మించడం మంచిది. మధ్యలో లేక అతిథుల దృష్టికి పూర్తిగా కనిపించే చోట ఉంచితే అది ఇంటి శక్తిని దెబ్బతీస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మెట్లు ఒక పక్కకు ఉంచితే గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

మెట్ల రంగులు కూడా…

మెట్ల రంగులు కూడా వాస్తు సిద్ధాంతాల్లో ముఖ్యమైన భాగం. లేత రంగులు, అంటే పాస్టెల్ షేడ్స్ వాడితే సానుకూల శక్తి పెరుగుతుంది. లేత గోధుమరంగు, ఆఫ్ వైట్, లేత పసుపు లేదా లేత నీలం వంటివి శుభప్రభావం ఇస్తాయి. నలుపు లేదా ముదురు ఎరుపు వంటి రంగులు నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.

తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి…

ఇంటి వెలుపల మెట్లు నిర్మించే సమయంలో కూడా దిశలు ముఖ్యం. తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి ఆగ్నేయ దిశలో, ఉత్తరం వైపు ఉన్న ఇంటికి వాయువ్య దిశలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం. అలాగే దక్షిణం లేదా పడమర ముఖంగా ఉన్న ఇళ్లకు నైరుతి భాగంలో మెట్లు వేయడం మంచిది. సరైన దిశల్లో ఉన్న మెట్లు ఇంటికి శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాయి.

బాత్రూమ్, పూజాగది..

మెట్ల కింద ఉన్న ఖాళీ ప్రదేశాన్ని చాలామంది స్టోరేజ్‌ కోసం ఉపయోగిస్తారు. కానీ వాస్తు ప్రకారం ఈ ప్రదేశంలో బాత్రూమ్, పూజాగది, నగదు లేదా బంగారం నిల్వ చేయడం మంచిది కాదు. సాధారణ వస్తువులు లేదా గృహోపకరణాలు ఉంచుకోవడం మాత్రమే మంచిది. ఇలాగే వాడితే ఇంటి శక్తి సమతుల్యం భద్రంగా ఉంటుంది.

Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-zodiac-signs-for-diwali-2025-and-their-prosperity/

ముగింపు వద్ద మాత్రమే..

మెట్ల ప్రారంభం లేదా ముగింపు వద్ద మాత్రమే తలుపులు ఉండాలి. మధ్యలో తలుపులు ఉంటే శక్తి ప్రవాహం దెబ్బతింటుందని చెబుతారు. అంతేకాదు, ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలకు మెట్లు నేరుగా తగలకూడదు. ఇది వాస్తు సమతుల్యానికి భంగం కలిగిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad