Sunday, November 16, 2025
HomeదైవంParijat Plant: పారిజాత మొక్కను ఈ దిశలో నాటితే.. ఆరోగ్యంతోపాటు అంతులేని ఐశ్వర్యం!

Parijat Plant: పారిజాత మొక్కను ఈ దిశలో నాటితే.. ఆరోగ్యంతోపాటు అంతులేని ఐశ్వర్యం!

Benefits of Parijat Plant: హిందువులు పారిజాతం మెుక్కను పవిత్రంగా భావిస్తారు. ఈ పుష్పం తెల్లగా చాలా అందంగా ఉంటుంది. దీని నుంచి పరిమళానికి ఎవరైనా మైమరచిపోవాల్సిందే. దీని ప్రత్యేకత ఏంటంటే సూర్యస్తమయం తర్వాత వికసిస్తుంది. తెల్లవారుజామున నేలపై రాలిపోతుంది. అంతేకాకుండా ఈ మెుక్కకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దీని నుంచి సుగంధ తైలమును తయారు చేస్తారు. అంతేకాకుండా ఈ మెుక్క యెుక్క ఆకుల రసాన్ని పిల్లలకు భేదిమందుగా ఉపయోగిస్తారు. ఈ చెట్టుపువ్వులతో శ్రీకృష్ణుడిని పూజిస్తే శుభ జరుగుతుందని విశ్వాసం.

- Advertisement -

ఈ మెుక్కకు పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది. పౌరాణిక గాథల ప్రకారం, శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామకి ఇచ్చినట్లు తెలుస్తోంది. వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ చెట్టు ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తులు వ్యాపిస్తాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ పారిజాత మెుక్కకు వ్యాధులను నయం చేసే గుణం కూడా ఉంది. ఈ పువ్వుల యెుక్క వాసనను పీల్చడం వల్ల దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్ముతారు.

ఏ దిశలో నాటాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో తూర్పు లేదా ఈశాన్య దిశలో పారిజాతం మొక్కను నాటితే లక్ష్మిదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం. దీనిని ఉత్తర లేదా పశ్చిమ దిశల్లో కూడా నాటవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మెుక్కను దక్షిణ దిశలో నాటకూడదు. ఎందుకంటే దక్షిణ దిశలో యముడి ఉంటాడని నమ్ముతారు. ఈ అరుదైన చెట్టును ఇంటి ముందు భాగంలో నాటడం వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వాసం. ఇది మీ ధనాన్ని పెంచడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.

పొదగా లేదా చిన్న చెట్టులాగా ఉండే పారిజాతం చెట్టు సుమారు 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీనికి ఎక్కువ సూర్యకాంతి అవసరం. కనీసం రోజుకు 8 గంటలు ఎండ తగలాలి. ఈ చెట్టు పువ్వులు తెలుపు రంగులో ఉండి మధ్యలో బంగారు వర్ణం సంతరించుకుంటాయి. ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది. ఈ చెట్టుకు ఉన్న మరోక ప్రత్యేకత ఏంటంటే..దీని ఆకులు గాని, శాఖలు గాని కుచించుకుపోయి కాండంలో కలిసిపోవడమే కానీ ఎండిపోయి రాలిపోవడం జరగదు. దీని విత్తనాలు, ఆకులు, పువ్వులు, బెరడును ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad