Thursday, September 19, 2024
HomeదైవంVeldurthi: సాక్షాత్తు ఆంజనేయుడే నడయాడే గుడి

Veldurthi: సాక్షాత్తు ఆంజనేయుడే నడయాడే గుడి

మీరెెప్పుడు ఇక్కడికి వస్తారు?

దుష్టగ్రహ బాధలను తొలగించి.. భక్తులకు అభయమిచ్చే హనుమంతుడు కొసనపల్లి గ్రామంలో అభయాంజనేయుడిగా కొలువయ్యారు. రామ భక్త హనుమాన్ ఎన్నో ఏళ్లుగా భక్తుల కోరికలు తీరుస్తూ, ఎంతో మహిమ, శక్తి గల ఆంజనేయుడిగా భక్తుల మనసులో కొలువై ఉన్నారు.

- Advertisement -

అంజన్న వచ్చేందుకు ప్రత్యేక దారి..

స్వయంగా ఆంజనేయ స్వామి వారే ఈ గుడిలోకి నడిచివస్తారని స్థల పురాణం. ఇది నమ్మడానికి కాస్త అతిశయోక్తి అనిపించినా గుడి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి గుడిలోకి ఆంజనేయ స్వామి నడిచి రావడానికి ప్రత్యేకంగా ఒక దారి ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఈ గుడిలో ఆంజనేయస్వామి సంచరిస్తాడనే విశ్వాసంతో స్వామి వారు నడిచే దారికి భక్తులు అడ్డురాకుండా ఖాళీ స్థలం వదిలేస్తారు.

దుష్ట శక్తులు దూరం చేసే..

భూత, ప్రేత పిశాచ భాదితులు స్వామి సన్నిధిలో రాగానే….వారికి ఆవహించిన దుష్ట శక్తులన్నీ దూరమైపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మంగళవారం, శనివారం నాడు స్వామి వారికి అభిషేకం, ఆకుపూజ వంటి విశేషపూజలు జరుగుతాయి. భక్తిశ్రద్ధలతో పూజించి ఆలయ ప్రాంగణంలో నిద్ర చేస్తే బాధలూ, పీడలూ తొలగుతాయని నమ్ముతారు.

రామ నవమి వేడుకలు..

ఏటా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి తదితర పండుగలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే శ్రావణమాసంలో మూడవ శనివారం గ్రామ సమీపంలోని దేవుళ్ళ బండ దగ్గర నుంచి ఆంజనేయ స్వామి వారిని గుర్రంపై గ్రామంలోకి తీసుకొస్తారు. ఆరోజున గ్రామం మొత్తం పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. శనివారం నాడు పండుగను పురస్కరించుకొని ఆంజనేయ స్వామి నూతన పంచలోహ ప్రతిమను గ్రామ పురవీధుల గుండా పల్లకిలో ఊరోగించారు భజన భక్తులు. ఈ సందర్బంగా గ్రామానికి చెందిన పుల్లాసి శివ భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా కర్నూలు నంద్యాల అనంతపురం వంటి ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి రామబంటు హనుమంతుని దర్శించుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News