మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మగుండంలో బ్రహ్మేశ్వర ఉత్సవాలు 26వ తేదీ నుండి 1వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మగుండేశ్వర మహిమలు ఏంటో తెలుసుకుందాం..
ఆసక్తికర స్థలపురాణం
పూర్వం ద్వాపర యుగమున “జయమే జయ ” మహారాజు సర్పయాగం నిర్వహించి సర్ప శాపం వలన కుష్టు వ్యాధి నివారణకు “బ్రహ్మేశ్వర స్వామివారిని ” ప్రతిష్ట చేసినట్లు చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. ధర్మాంగరుడు అనే రాజు ఋషి శాపం వలన సర్ప ఆకృతి పనులను తీర్థ యాత్ర దర్శనముల శాపం విమోచనం కలుగునని ధర్మాంగదుడి సతీమణి తీసుకొని సర్ఫ్ ఆకృతి గల భర్తను తల మీద ఉంచుకొని కాశి కోటి క్షేత్రాలు తిరిగినా శాపం విమోచనం కలగలేదు.
మహిమాన్విత పుణ్యక్షేత్రం
చివరకు బ్రహ్మేశ్వర స్వామి క్షేత్రం నందు కొలనులో స్నానం ఆచరించి బ్రహ్మేశ్వరుని సేవించగా, సర్పాకృతి గల ధర్మాంగదుడు శాప విమోచితుడై తిరిగి మానవునిగా అవతరించెను. ఇలాంటి ఇంకా చాలా మహిమలు ఇక్కడి స్థలపురాణాలుగా ఉన్నాయని పూర్వీకులు చెబుతుంటారు. ఇంతటి మహిమాన్వితమైన బ్రహ్మ గుండేశ్వర స్వామి దర్శనం భక్తులకు సమస్త సుఖశాంతులు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలుగజేయడంలో సందేహం లేదని పూర్వీకులు చెప్తుంటారు.
మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ 26న జాగరణ, 28న రథోత్సవం, 1వ తేదీన వసంతోత్సవం, అదేరోజు బండలాగు పోటీలు నిర్వహిస్తారు.