Saturday, November 2, 2024
HomeదైవంVemulavada: రాజన్న ఆలయంలో ఘనంగా సామూహిక కార్తీక దీపోత్సవం

Vemulavada: రాజన్న ఆలయంలో ఘనంగా సామూహిక కార్తీక దీపోత్సవం

కార్తీక దీపం..

కార్తీక మాసం సందర్భంగా కళావేదిక ప్రాంగణంలో సుహాసినీలచే సామూహిక కార్తీక దీపోత్సవం నిర్వహించారు. సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమంను మొదటగా ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
కార్తీకమాసం మొదటిరోజు సందర్భంగా రాజన్న ఆలయంలో ఆలయ అర్చకుల వేద మంత్రాల మధ్య కార్తీక దీపాన్ని వెలిగించి ప్రదోషకాలంలో గండాదీపంపై ఉంచారు. మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం ఈ దీపం వెలిగిస్తారని ఆలయ స్థానాచారి అప్పాల భిమాశంకర్, నమిలకొండ రాజేశ్వరశర్మ అన్నారు. ప్రతి దేవాలయంలో ఈ దీపాన్ని వెలిగిస్తారని, కార్తీకమాసంలో దీపానికి ప్రత్యేకత ఉందని అన్నారు. ఈ ఆకాశ దీపం గండాదీపంపై ఉంచడంతో కార్తీకమాసం మొత్తం ఉంటుందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానాచారి అప్పాల భిమాశంకర్, ఏఈఓ గజ్వేల్లి రమేష్ బాబు, ఆలయ పర్యవేక్షకులు వరి నరసయ్య, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News