దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం శివపార్వతుల కల్యాణ వేడుకలకు ముస్తాబైంది. ఆలయంలో 27వ తేదీ బుధవారం నుండి 31వ తేదీ వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే వేడుకకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ క్రమంలో 28వ తేదీ గురువారం రోజున ఉదయం 10.50 ని.ల నుండి మద్యాహ్నం 12.55ల వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుటకు ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ ముందు భాగంలో ఆలయ అధికారులు కళ్యాణ వేదికను, ఆలయ ధ్వజస్తంభం వద్ద యాగశాలను ఏర్పాటు చేశారు.
ఆలయ విమాన గోపురానికి, ఆలయ ఆవరణలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి, విద్యుత్ వెలుగులో రాజన్న క్షేత్రం తళుక్కుమనేల తీర్చిదిద్దారు. అట్లాగే భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో భాగంగా 30వ తేదీ శనివారము రోజున సాయంత్రం గం.3.05 ని.ల నుండి శ్రీ స్వామివారి రథోత్సవము నిర్వహించేందుకు ఆలయ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు