Friday, December 12, 2025
HomeదైవంNavratri 2025: నవరాత్రుల్లో అర్ధ కేంద్ర రాజయోగం.. ఈ మూడు రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Navratri 2025: నవరాత్రుల్లో అర్ధ కేంద్ర రాజయోగం.. ఈ మూడు రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Shukra Guru Gochar 2025: శరన్నవరాత్రులు ఇప్పటికే మెుదలయ్యాయి. ఈ నవరాత్రుల్లో గ్రహాల సంచార ప్రభావం మెుత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. ఈ పర్వదినాల్లో దేవ గురు బృహస్పతి, రాక్షసుల గురువైన శుక్రుడు సెప్టెంబరు 25న అర్ధ కేంద్ర యోగాన్ని సృష్టిస్తాయి. ఇది చాలా శక్తివంతమైనది. ఈ యోగ ప్రభావంతోపాటు దుర్గాదేవీ అనుగ్రహం కలగబోయే రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

సింహ రాశి
సింహరాశి వారికి శుక్రుడు, బృహస్పతి సంయోగం అద్భుతంగా ఉంటుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. చేపట్టే ప్రతి ప్రాజెక్టును సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యులు మరియు మిత్రులు నుంచి సహకారం లభిస్తుంది. దీర్ఘకాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.

ధనుస్సు రాశి
గురుడు, శుక్రుడు కలయిక ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. నవరాత్రుల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంతోపాటు సద్వినియోగం కూడా చేసుకుంటారు. ఎంతో కాలంగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఉద్యోగం కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. కెరీర్ లో అద్భుతమైన పురోగతిని చూడవచ్చు. వైవాహిక జీవితంలో ఉన్న వివాదాలు ముగిసిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అపాయ్యతలు పెరుగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి.

Also Read: Navaratri 2025-రెండో రోజు అవతారం బ్రహ్మచారిణి.. ఎలా పూజించాలో తెలుసా?

వృషభ రాశి
అర్ధ కేంద్ర రాజయోగం వల్ల వృషభరాశి వారి అదృష్టం మారబోతుంది. జాబ్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. పూర్వీకులు ఆస్తులు కలిసి రావడంతోపాటు భారీగా ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తారు. అన్ని సమస్యల నుండి బయటపడతారు. సంసార జీవితంలో భార్యభర్తల మధ్య అన్యోన్యత మరింత పెరుగుతుంది. వ్యాపారం విస్తరిస్తుంది. కెరీర్ లో స్థిరత్వం ఉంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.

Disclaimer: పైన ఇచ్చిన సమాచారం మత విశ్వాసాల పై ఆధారపడి ఉంది. దీనిని పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు. దీనిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News