Shatank yog effect in Telugu: పంచాంగం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాలను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో అవి ఇతర ఫ్లానెట్స్ తో కలిసి కొన్ని శక్తివంతమైన యోగాలను రూపొందిస్తాయి. నవంబర్ 11, మంగళవారం నాడు శుక్రుడు మరియు బృహస్పతి గ్రహాలు రెండు ఓ అరుదైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 100 డిగ్రీల కోణీయ స్థితిలో ఉండటం వల్ల శతాబ్ది లేదా శతంక్ యోగం సంభవించబోతుంది. ఇది 10 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. దీని వల్ల మూడు రాశులవారికి మంచి రోజుల రాబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
శుక్రుడు మరియు గురుడు చేస్తున్న పవర్ పుల్ యోగం కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఊహించని స్థాయికి ఎదుగుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి, సంతోషం నెలకొంటాయి. విదేశాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. ఏదైనా ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. వివాహ యోగం ఉంది.
ధనస్సు రాశి
శతాంక్ యోగం వల్ల ధనస్సు రాశి వారి ఆదాయం ఓ రేంజ్ లో పెరగబోతుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఉద్యోగులకు వస్తుంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు అనుకూలిస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
Also Read: Mars Asta 2025 -అస్తమించిన కుజుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
కన్యా రాశి
కన్యా రాశి వారికి శతాంక్ యోగం ఎంతో మేలు చేయనుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. మీరు పనిచేసే చోట సీనియర్ల సపోర్టు లభిస్తుంది.


