Deepavali 2025 Horoscope: మరికొన్ని రోజుల్లో దీపాల పండుగ రాబోతుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం, దీపావళిని అక్టోబర్ 20, 2025న జరుపుకుంటారు. ఈరోజున భక్తులు గణేశుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళికి ముందు కొన్ని గ్రహాలు మరియు నక్షత్రాలు తమ గమనాన్ని మార్చి అరుదైన యోగాలు సృష్టించబోతున్నాయి. ప్రస్తుతం సింహరాశిలో శుక్రుడు, కేతువులు సంయోగంలో ఉన్నారు. వీరిద్దరి కలయిక అక్టోబర్ 09 వరకు కొనసాగనుంది. దీపావళికి ముందు వీరిద్దరి మైత్రి విచ్ఛిన్నం కావడం వల్ల మూడు రాశులవారికి అద్భుతంగా ఉండబోతుంది. ఆ లక్కీ రాశులు ఏవో ఓ లుక్కేద్దాం.
ధనుస్సు రాశి
దీపావళికి ముందు శుక్ర-కేతువుల సంయోగం విచ్ఛిన్నం కావడం కూడా ధనుస్సు రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. పాత పెట్టుబడులు లాభిస్తాయి. మీ ఇంటిపై లక్ష్మీదేవి కనకవర్షం కురిపించనుంది. పాత వివాదాలు పరిష్కరించబడతాయి. మీరు కెరీర్ లో ఊహించని ఎత్తుకు చేరుకుంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు.
తులారాశి
శుక్ర-కేతువుల కలయిక తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. మీ తల్లిదండ్రులు ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. తులా రాశి వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. లైఫ్ పార్టనర్ తో రొమాంటిక్ సమయం గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. అన్ని సమస్యల నుండి బయటపడతారు.
Also Read: karwa Chauth 2025- కర్వా చౌత్ నాడు సూర్యచంద్రుల సంచారం.. ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి..
మీనరాశి
మీన రాశి వారికి శుక్ర-కేతువుల సంయోగం అద్భుతంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఆర్థిక స్థిరత్వం పొందుతారు. కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో విభేదాలు సద్దుమణుగుతాయి. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇదే మంచి టైం. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు. రుణ విముక్తి నుండి బయటపడతారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు .. పండితుల అభిప్రాయాలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను రూపొందించడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రియత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


